- N8 మరియు N10 వేరియంట్లలో అందించే అవకాశం
- కొత్త పవర్డ్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రానున్న క్రెటాN లైన్
2024క్రెటా లాంచ్ తో హ్యుందాయ్ కంపెనీ పెర్ఫార్మెన్స్ వెర్షన్ లో వస్తున్న క్రెటాN లైన్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. స్పోర్టియర్ వెర్షన్లో కొత్త కలర్, N లైన్ బ్యాడ్జింగ్, మరియు మరిన్ని కాస్మోటిక్ అప్డేట్స్ తో టివిసి షూట్ వద్ద కనిపించింది.
క్రెటా N లైన్: ఎక్స్టీరియర్ అప్డేట్స్
హ్యుందాయ్ కంపెనీ క్రెటాN లైన్ ని సిగ్నేచర్ థండర్ బ్లూతో పాటుగా కొత్త మ్యాట్ గ్రే కలర్ లో అందించనుంది. అంతే కాకుండా, ఈ ఎస్యూవీ స్పోర్ట్ లుక్ ని అందించే ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రూఫ్ స్పాయిలర్, మరియు భారీ 18-ఇంచ్ వీల్స్ ని పొందింది. ఇతర N లైన్ మోడల్స్ లాగా, బయట మరియు లోపల ఇందులో కూడా రెడ్ కలర్ యాక్సెంట్ లో “N లైన్” బ్యాడ్జింగ్ ఉండనుంది. క్రెటా N లైన్ స్ట్రాంగ్ సస్పెన్షన్ సెటప్‌తో పాటు డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్‌ల నుండి కూడా బెనిఫిట్ పొందనుంది.
క్రెటా N లైన్: ఇంటీరియర్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్
స్పై పిక్చర్స్ ని చూస్తే, క్యాబిన్ లోపల N లైన్-స్పెసిఫిక్ గేర్ లీవర్ మరియు స్టీరింగ్ వీల్ తో పాటుగా అంతటా పూర్తి బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ఉన్నట్లు వెల్లడవుతుంది. రెడ్ యాక్సెంట్స్ కూడా బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, ఎయిర్కాన్ వెంట్స్ మరియు డ్యాష్‌బోర్డ్‌లోని డిస్ప్లే స్క్రీన్స్ చుట్టూ ఇంటిగ్రేట్ చేసి ఉంది.
క్రెటా N లైన్: ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ఆప్షన్స్
హుడ్ కింద, క్రెటా N లైన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఇది 158bhp మరియు 253Nm పీక్ టార్కును ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి యూనిట్ తో జత చేయబడి వస్తుంది.
క్రెటా N లైన్: లాంచ్ తేదీ మరియు ధరలు
క్రెటా N లైన్ N8 మరియు N10 వేరియంట్లలో రూ.21 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ అంచనా ధరతో వచ్చే నెల అనగా మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది అని మేము భావిస్తున్నాము
చిత్ర మూలం
అనువాదించిన వారు: సంజయ్ కుమార్