- 11మార్చి 2024న లాంచ్ అయ్యే అవకాశం
- రెండు వేరియంట్లలో లభించనున్న క్రెటా
కొరియన్ ఆటోమేకర్, హ్యుందాయ్ క్రెటా N లైన్ ధరలను 11 మార్చి 2024న వెల్లడిస్తుందని మేము వేచిచూస్తున్న సమయంలో, పెర్ఫార్మెన్స్ ఎస్‌యువి కనిపించింది. ఇది బహుశా షోరూమ్ లేదా డీలర్‌షిప్ స్టాక్‌యార్డ్‌కు వెళ్తున్నట్లు ఉంది.
క్రెటా ఎన్ లైన్ వెర్షన్ N8 మరియు N10 అనే రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది. ఈ మోడల్ సిగ్నేచర్ థండర్ బ్లూ ఎక్ట్సీరియర్ పెయింట్‌తో చూడటానికి కొత్తగా ఉండే రెడ్ యాక్సెంట్స్ కలర్ తో చుట్టబడి ఉంది. డిజైన్ వారీగా చెప్పాలంటే, క్రెటా ఎన్ లైన్ అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రీడిజైన్ చేయబడిన 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ మరియు గ్రిల్, ఫెండర్స్ మరియు టెయిల్‌గేట్‌పై N లైన్ బ్యాడ్జింగ్‌ను పొందుతుంది. ఇంకా, కనెక్ట్ చేయబడిన టెయిల్‌లైట్స్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పూర్తి-వెడల్పు ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, 360-డిగ్రీల సరౌండ్ కెమెరా మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో వెనుక స్పాయిలర్ వంటి ఇతర అంశాలు స్టాండర్డ్ క్రెటా నుండి తీసుకున్నట్లు అనిపిస్తాయి.
దీని ఆటోమేకర్ ఇటీవల క్రెటా ఎన్ లైన్ యొక్క ఇంటీరియర్ చిత్రాలను వెల్లడించింది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్‌పై రెడ్ కలర్ ఇన్సర్ట్‌లతో క్యాబిన్ అంతటా బ్లాక్-అవుట్ థీమ్ ను పొందుతుంది. తర్వాత, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ 10.25-ఇంచ్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్,8-వే పవర్డ్ డ్రైవర్ సీట్స్ మరియు బోస్-సోర్స్ మ్యూజిక్ సిస్టమ్ ప్యాకేజీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మెకానికల్‍గా, క్రెటా N లైన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ మోటార్ 158bhp మరియు 253Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప