- రెండు వేరియంట్లు మరియు సింగిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్ తో అందించబడుతున్న మోడల్
- సింగిల్-టోన్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్లలో వచ్చిన క్రెటా N లైన్
ఇండియాలో అత్యంత ఖరీదైన N లైన్ వెర్షన్ అయిన క్రెటా N లైన్ వస్తుందని టీజ్ చేయబడగా, మొత్తానికి హ్యుందాయ్ కంపెనీ పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ ఎస్‍యూవీని రూ.16.82 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ క్రెటా N లైన్ ని N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో పొందవచ్చు.
పెర్ఫార్మెన్స్-పరంగా, హ్యుందాయ్ క్రెటా N లైన్ యొక్క సింగిల్ 1.5-లీటర్ టర్బో- జిడిఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. అదే విధంగా ఈ పవర్ ట్రెయిన్ స్టాండర్డ్ క్రెటాలో అందుబాటులో ఉండగా, మాన్యువల్ గేర్ బాక్స్ ఎక్స్‌క్లూజివ్ గా N లైన్ వెర్షన్లో అందించబడింది. ఇందులోని మోటార్ 158bhp మరియు 253Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది.
స్టాండర్డ్ క్రెటాతో పోలిస్తే, క్రెటా N లైన్ రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, N లైన్ బ్యాడ్జింగ్‌తో ట్వీక్ చేసిన గ్రిల్, మోడల్ చుట్టూ రెడ్ కలర్ యాక్సెంట్స్, 18-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్ పొందింది. ఇంకా చెప్పాలంటే, దీనిని మూడు మోనోటోన్ కలర్లలో మరియు అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే మ్యాట్, అబిస్ బ్లాక్ రూఫ్ తో థండర్ బ్లూ, అబిస్ బ్లాక్ రూఫ్ తో అట్లాస్ వైట్, మరియు అబిస్ బ్లాక్ రూఫ్ తో షాడో గ్రే అనే డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
ఇంటీరియర్ పరంగా చూస్తే, క్రెటా N లైన్ లోపలి భాగంలో రెడ్ యాక్సెంట్స్ మరియు ఇన్సర్ట్స్ పై అంతటా ఆల్-బ్లాక్ థీమ్ ని పొందింది. ఈ వెర్షన్ ని మరింత ప్రత్యేకంగా ఉంచడానికి హ్యుందాయ్ స్టీరింగ్ వీల్, గేర్ లీవర్, మరియు బ్లాక్ లెదరెట్ సీట్ అప్హోల్స్టరీపై N లైన్ బ్యాడ్జెస్ ని అందించింది.
ఇంకా చెప్పాలంటే, స్టాండర్డ్ వెర్షన్ లాగే క్రెటా N లైన్ వెర్షన్ బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ 10.25-ఇంచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ప్యాడిల్ షిఫ్టర్స్, పవర్డ్ మరియు వెంటిలేటెడ్ డ్రైవర్ సీటు, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, స్మార్ట్ పనోరమిక్ సన్ రూఫ్ మరియు లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్)సూట్ వంటి ఫీచర్లతో వచ్చింది.
నేడే లాంచ్ అయిన క్రెటా N లైన్ 18 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుండగా, కియా సెల్టోస్ X లైన్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి మరియు స్కోడా కుషాక్ మోంటేకార్లోకు వంటి కార్లకు పోటీగా ఉంది. ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 42 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ మరియు 70కి పైగా స్మార్ట్ సేఫ్టీ ఫీచర్స్, 6-ఎయిర్ బ్యాగ్స్ అందించబడ్డాయి. ఇక సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే క్రెటా N లైన్ ని ఇప్పటివరకు ఏ ఎన్ క్యాప్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
వేరియంట్-వారీగా కొత్త హ్యుందాయ్ క్రెటా N లైన్ యొక్క ఎక్స్-షోరూం ధరలు ఈ కింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
N8 మాన్యువల్ | రూ. 16.82 లక్షలు |
N8 డిసిటి | రూ. 18.32 లక్షలు |
N10 మాన్యువల్ | రూ. 19.34 లక్షలు |
N10 డిసిటి | రూ. 20.29 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్