- రెడ్ యాక్సెంట్స్ తో రానున్న ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్
- రూ.25 వేల టోకెన్ అమౌంట్ తో ప్రస్తుతం బుకింగ్స్ ఓపెన్
హ్యుందాయ్ ఇండియా క్రెటా ఎస్యూవీ యొక్క N లైన్ వెర్షన్ ని మార్చి 11వ తేదీన లాంచ్ చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇది వరకే హ్యుందాయ్ అధికారిక పోర్టల్ లో కేవలం రూ.25.000 బుకింగ్ అమౌంట్ తో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లాంచ్ కి ముందే, ఆటోమేకర్ హ్యుందాయ్ క్రెటా N లైన్ మోడల్ లో రాబోతున్న ఇంటీరియర్ మరియు ఫీచర్లను వెల్లడించింది.
పెర్ఫార్మెన్-ఓరియంటెడ్ క్రెటా డ్యాష్ బోర్డు, ఏసీ వెంట్స్, మరియు గేర్ లీవర్ పై రెడ్ ఇన్సర్ట్స్ తో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ని పొందనుంది. అలాగే, ఇది మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, మరియు లెదరెట్ సీట్లపై రెడ్ స్టిచింగ్ ని కలిగి ఉంది. ఇంకా గేర్ నాబ్ పై ‘N’ బ్యాడ్జింగ్ తో పాటుగా ఇంతకు ముందు ఉన్నట్లు ఫ్రంట్ సీట్లపై మస్కట్లను కలిగి ఉంది.
ఫీచర్స్ పరంగా, క్రెటా N లైన్ లో ఉన్న ఫీచర్స్ అన్ని స్టాండర్డ్ ఇటరేషన్ నుంచి తీసుకున్నట్లు అనిపిస్తాయి. ఇది ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ 10.25-ఇంచ్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్), పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 8-వే పవర్డ్ డ్రైవర్ సీట్ మరియు బోస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టం వంటి అద్బుతమైన ఫీచర్లతో రానుంది.
హ్యుందాయ్ క్రెటా N లైన్ మొత్తం N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అలాగే దీని ఏకైక 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి రానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్