- 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన కొత్త క్రెటా
- ఇండియాలో రూ.16.82 లక్షలతో ధరలు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న దాని N లైన్ సిరీస్ యొక్క ఫ్లాగ్ షిప్ మోడల్ క్రెటా N లైన్ ని హ్యుందాయ్ ఇండియా మార్చి 11న (సోమవారం) లాంచ్ చేసింది. ఈ క్రెటా ఎస్‍యూవీ యొక్క పెర్ఫార్మెన్స్ వెర్షన్ N8 మరియు N10అనే రెండు వేరియంట్లలో రూ.1682 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు మనం కొత్త క్రెటా N లైన్ యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్రెటా N లైన్ ఎస్‍యూవీ యొక్క 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 158bhp మరియు 253Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ టర్బో-జిడిఐ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సును జత చేయబడి వచ్చింది.
ఇప్పుడు, ఆటోమేకర్ ప్రకారం, ఈ ఎస్‍యూవీ యొక్క ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వివరాలు చూస్తే, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లు వరుసగా 18కెఎంపిఎల్ మరియు 18.2కెఎంపిఎల్ మైలేజీని అందిస్తున్నాయి. అదే విధంగా, ప్రస్తుతం స్టాండర్డ్ క్రెటా టర్బో పెట్రోల్ ఇంజిన్ తో లభ్యమవుతుండగా, ఇది డిసిటి టైప్ లో 18.4కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుంది.
కొరియన్ ఆటోమేకర్ నుండి వచ్చిన పెర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ లైనప్ లోకి i20 N లైన్ మరియు వెన్యూ N లైన్ తో పాటుగా ఇప్పుడు కొత్తగా హ్యుందాయ్ క్రెటా N లైన్ కూడా చేరింది. తాజాగా, అంటే లాంచ్ కంటే ముందే, ఈ రెండు వేరియంట్లు వేరే వేరే కలర్లలో డీలర్ షిప్స్ వద్ద కనిపించాయి. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం దీనిపై బుకింగ్ చేసిన తేదీ నుండి 6 – 8 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్