- తాజాగా వెర్నా కార్లను రీకాల్ చేసిన హ్యుందాయ్
- ఎలాంటి ఖర్చు లేకుండా కారును ఉచితంగా తనిఖీ చేసి, సరిచేయనున్న హ్యుందాయ్
ఇండియాలో ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్రీ-ఫేస్‍లిఫ్ట్ క్రెటా ఐవిటి వేరియంట్లను హ్యుందాయ్ రీకాల్ చేసింది. కొంతసేపటి క్రితమే ఈ అప్‍డేట్ రాగా, అంతకంటే ముందు వెర్నా సెడాన్ లోని ఈఓపీ(ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్) కంట్రోలర్ లో సమస్య కారణంగా బ్రాండ్ వీటిని రీకాల్ చేసింది.
ఇంకా క్రెటా విషయానికి వస్తే, మిడ్ సైజ్ ఎస్‍యూవీ ఐవిటి (సివిటి అని కూడా పిలుస్తారు) వేరియంట్లలోని ఈఓపీ(ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్) కంట్రోలర్ లో సమస్య ఉత్పన్నమవడంతో వీటిని రీకాల్ చేసింది. ప్రస్తుతం కంపెనీ వారి కార్లలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఓనర్లను సంప్రదించే పనిలో బిజీగా ఉంది.
ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ ఎన్ని కార్లను రీకాల్ చేసిందో వాటి సంఖ్యను గానీ, ఏ తేదీన మానుఫాక్చరింగ్ చేసిన కార్లు ఈ సమస్యకు గురయ్యాయో వాటి వివరాలను వెల్లడించలేదు. రీకాల్ లో భాగంలో కారును తనిఖీ చేసి, కారులో ఏదైనా సమస్య ఉన్నట్లు భావిస్తే, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా సర్వీసును అందించి, సమస్యను సరిచేయనున్నట్లు పేర్కొంది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు తమ కారును రీకాల్ చేయడానికి లేదా కారును తనిఖీ చేయడానికి వారి సమీపంలోని అధికారిక సర్వీస్ స్టేషన్‌ను సంప్రదించవలసిందిగా కంపెనీ పేర్కొంది. గత నెలలో, కియా కార్లలో కూడా ఇదే సమస్య ఎదురవడంతో సుమారు 4,000 పైగా సెల్టోస్ కార్లను రీకాల్ చేసింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్