- ఏడీఏఎస్ మరియు 360-డిగ్రీ కెమెరాతో వచ్చే అవకాశం
- 2024 ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ భారతీయ రోడ్లపై మరోసారి టెస్టింగ్ చేయబడుతుంది. ఈ టెస్టింగ్ వెహికిల్ బయట మరియు లోపల పూర్తిగా కప్పి ఉంచినప్పటికీ, దీని ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ మరియు అప్‌డేటెడ్ క్యాబిన్ ను చూస్తే మనకు కొన్ని కీలకమైన వివరాలను తెలుస్తాయి.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్: కొత్తగా ఏముంది?
క్రెటా అప్‍డేటెడ్ వెర్షన్ ముందు మరియు వెనుక పూర్తిగా రీడిజైన్ చేయబడి సరికొత్త డిజైన్ తో రానుంది. ఫ్రంట్ ఎండ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను ఇందులో కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ, హెడ్‌ల్యాంప్ హౌసింగ్ కొత్తగా, స్లిమ్ గా మరియు హారిజాంటల్ గా డిజైన్ చేయబడింది. ఇది కాకుండా, వెనుక భాగంలో పెద్ద మాడిఫైడ్ టెయిల్ ల్యాంప్స్ మరియు వెర్నాలో కనిపించిన విధంగా పూర్తి వెడల్పైన ఇల్యూమినేటెడ్ లైట్ స్ట్రిప్‌ను కూడా కలిగి ఉంది. కొత్త క్రెటాలో ఆల్కాజార్‌లో కనిపించిన విధంగా పెద్ద 18-ఇంచ్ వీల్స్ ఇందులో కూడా ఉంటాయని మేము భావిస్తున్నాము.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్
క్రెటా క్యాబిన్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రీడిజైన్ చేయబడుతుంది. ఏడీఏఎస్ సూట్‌తో పాటు 360-డిగ్రీ కెమెరా ద్వారా స్పై పిక్చర్స్ తీసే ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది. దీని మాడ్యూల్ ముందు బంపర్ దిగువ భాగంలో వీటిని మనం గమనించవచ్చు.
క్రెటా ఫేస్‌లిఫ్ట్: ఇంజన్ ఆప్షన్స్
కొత్త క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో రానున్నాయి.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ తేదీ
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 2024 ప్రారంభంలో లాంచ్ చేస్తుందని మేము అంచనా వేస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్