- 7 కలర్లలో 7 వేరియంట్లలో క్రెటా ఫేస్‍లిఫ్ట్ లభ్యం
- పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్లతో వచ్చిన కొత్త క్రెటా
హ్యుందాయ్ కంపెనీ ఇండియాలో తన అప్‍డేటెడ్ క్రెటా ఫేస్‍లిఫ్ట్ ను అధికారికంగా రూ.11 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. మొత్తంగా కొత్త క్రెటా ఫేస్‍లిఫ్ట్ మోడల్ E, EX, S, S(O), SX, SX టెక్, మరియు SX(O)అనే 7 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. కియా సెల్టోస్ తో పోటీ పడుతున్న క్రెటా ఫేస్‍లిఫ్ట్ ని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సుతో పొందవచ్చు.
అప్‍డేట్స్ పరంగా, హ్యుందాయ్ కంపెనీ 2024 హ్యుందాయ్ క్రెటాలో ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ ను పూర్తిగా అప్ డేట్ చేసింది. కారు ముందు భాగంలో, భారీగా కనిపించే మూడు-వరుసల హారిజాంటల్ గ్రిల్, ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, హెచ్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, నిలువుగా అమర్చబడిన ఫాగ్ ల్యాంప్స్ మరియు ఒక జత కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ తో ఫ్రంట్ ఫాసియా రీడిజైన్ చేయబడింది. ఇక కారు వెనుక భాగంలో, అతి పెద్ద మార్పు ఏంటి అంటే, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ సెటప్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ని తీసుకువచ్చింది.
ఇంటీరియర్ పరంగా చూస్తే, 2024 క్రెటాలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్స్ మరియు వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్స్ వంటి ఫీచర్లను హ్యుందాయ్ తీసుకువచ్చింది. అదనంగా ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సరౌండ్ వ్యూ మానిటర్ మరియు లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్)సేఫ్టీ సూట్ వంటి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది.
పవర్ ట్రెయిన్స్ పరంగా చూస్తే, క్రెటాఫేస్‍లిఫ్ట్ ను 3 ఇంజిన్ ఆప్షన్లతో పొందవచ్చు. ఇందులో 113bhp పవర్ మరియు 144Nm టార్కును ఉత్పత్తి చేసే 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్, 114bhp పవర్ మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, మరియు 158bhp పవర్ మరియు 253Nm టార్కును ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. అలాగే ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డిసిటి, మరియు సివిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
వేరియంట్-వారీగా కొత్తగా లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఫేస్‍లిఫ్ట్ యొక్క ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూం ధర |
E | రూ. 10.99 లక్షలు |
EX | రూ.12.17 లక్షలు |
S | రూ. 13.39 లక్షలు |
S(O) | రూ. 14.32 లక్షలు |
SX | రూ.15.26 లక్షలు |
SX టెక్ | రూ. 15.94 లక్షలు |
SX(O) | రూ. 17.23 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్