- 158bhp, 1.5-లీటర్ టర్బో పెట్రోక్ ఇంజిన్ తో వచ్చే అవకాశం
- అందుబాటులోకి రానున్న రీఫ్రెష్డ్ ఎక్స్‌టీరియర్ మరియు మరిన్ని కొత్త ఫీచర్స్
కొత్త హ్యుందాయ్ క్రెటా 16 జనవరి, 2024లో ఇండియాలో అరంగేట్రం చేయనుంది. ఈ సరికొత్త పాపులర్ మిడ్-సైజ్ ఎస్‍యూవీ రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్, కొత్త ఫీచర్స్ తో అప్ గ్రేడ్ చేయబడిన క్యాబిన్, మరియు బ్రాండ్ నుంచి నూతనంగా 1.5-లీటర్ టర్బో పెట్రోక్ ఇంజిన్ వంటి వాటితో మరింత స్టైలిష్ గా, పెర్ఫార్మెన్స్ పరంగా మరింత అద్బుతంగా ఉండనుంది.
అప్ డేటెడ్ వెర్షన్ లో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్,కొత్తగా మరియు మరింతసన్నగా కనిపించేహెడ్‌ల్యాంప్ హౌసింగ్, మరియు ఇవి వర్టికల్ గా అమర్చబడి ఉండనున్నాయి. అంతే కాకుండా, దీని రియర్ ప్రొఫైల్ లో వెర్నాలో మనం చూసినట్లుగా భారీ మార్పులతో కూడిన పెద్ద టెయిల్ ల్యాంప్స్ మరియు ఫుల్-విడ్త్ ఇల్యూమినేటెడ్ లైట్ స్ట్రిప్ వంటి ఫీచర్ కూడా ఉండనున్నాయి. అలాగే, అల్కాజార్ లో చూసినట్లుగా దీనికి సరిపోయే విధంగా 18-ఇంచ్ భారీ వీల్స్ ఇందులో కూడా ఉంటాయని మేము భావిస్తున్నాం.
క్రెటా ఫేస్‍లిఫ్ట్ లో మరిన్ని కొత్త ఫీచర్స్ ఉండే అవకాశం
ఇంటీరియర్ పరంగా చూస్తే, హ్యుందాయ్ లో కొత్త అప్హోల్స్టరీతో రీఫ్రెష్ క్యాబిన్డ్, ఫుల్లీ డిజిటల్ మరియు కలర్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఏడీఏఎస్టెక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇతర ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగా ఇందులో కూడా పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు 4-స్పోక్ స్టీరింగ్ డిజైన్ వంటివి ఉండే అవకాశం ఉంది.
కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రానున్న క్రెటా ఫేస్‍లిఫ్ట్
ఫేస్‍లిఫ్ట్ లో, క్రెటా కొత్త పవర్డ్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. 158bhp ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడిన ఈ ఇంజన్ ఇప్పటికే హ్యుందాయ్ వెర్నా మరియు హ్యుందాయ్ అల్కాజార్ వంటి ఇతర హ్యుందాయ్ మోడల్స్ లో తన విధులను నిర్వహిస్తోంది.
2024లో లాంచ్ అయిన తర్వాత, క్రెటా కొత్త కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఎంజిఆస్టర్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్ మరియు టయోటా హైరైడర్ వంటి వాటితో పోటీ పడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్