- జనవరి 16న ఇండియాలో వెల్లడికానున్న క్రెటా ఫేస్‌లిఫ్ట్ ధరలు
- ఏడీఏఎస్ మరియు న్యూ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నట్లు నిర్ధారణ
హ్యుందాయ్ ఇండియా 2024లో రాబోయే క్రెటా పై టెస్టింగ్ ను కొనసాగిస్తోంది, జనవరి 16న ఈ వెర్షన్‌ను హ్యుందాయ్ లాంచ్ చేయనుంది. కొత్త స్పై షాట్స్ లో చూస్తే కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు హోండా ఎలివేట్‌లకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఈ అప్‌డేట్ చేయబడిన మిడ్-సైజ్ ఎస్‌యువిలో కీలక ఫీచర్స్ ఉన్నాయి. .
ఇక్కడ స్పై షాట్‌లో చూసినట్లుగా, ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా కొత్త, పూర్తిగా డిజిటల్, కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందింది, ఇది అచ్చం 7-సీట్ల అల్కాజార్ మాదిరిగానే ఉంది. అంతేకాక, ఈ మోడల్‌కు డాష్‌క్యామ్ లభించిందన్న వాస్తవాన్ని కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇది ఎక్స్‌టర్‌లో అరంగేట్రం చేసిన అదే డ్యూయల్ డాష్‌క్యామ్ యూనిట్ ప్రస్తుతం ఇండియాలో విక్రయించబడుతున్న వివిధ హ్యుందాయ్ మోడళ్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
రిఫ్రెష్ చేయబడిన హ్యుందాయ్ క్రెటా సరికొత్త గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు, న్యూ అల్లాయ్ వీల్స్, న్యూ హెచ్-షేప్డ్ ఎల్ఈడీ టైల్‌లైట్లు మరియు బూట్ లిడ్‌పై ఎల్ఈడీ లైట్ బార్‌తో న్యూ ఫాసియాను పొందుతుందని మునుపటి స్పై షాట్‌లు సూచిస్తున్నాయి. ఈ మోడల్ లోపలి భాగంలో, 360-డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ సూట్, న్యూ అప్హోల్స్టరీ మరియు రివైజ్డ్ ఇంటీరియర్ థీమ్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం.
అవుట్‌గోయింగ్ వెర్షన్ లో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ మరియు 1.5-లీటర్ డీజిల్ మిల్ తో సహా పవర్‌ట్రైన్ ఆప్షన్స్ ఏమాత్రం మార్పు లేకుండా వచ్చే అవాకాశం ఉంది. అయితే మనం ఏది ఆశించినా అది అదనం అని చెప్పవచ్చు, అదే విధంగా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప