- వచ్చే సంవత్సరం ఇండియాలో వెల్లడికానున్న హ్యుందాయ్ క్రెటా ధరలు
- కొత్త 1.5-లీటర్ టర్బో- పెట్రోల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం
ఇండియాలో లాంచ్ అవ్వకముందే హ్యుందాయ్ క్రెటా ఫేస్‍లిఫ్ట్ మరోసారి టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది. ఇది 2024 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. కొత్త స్పై షాట్స్ లో మాకు కనిపించింది ఏంటి అంటే ఈ కార్ చాలా వరకు సింగిల్ టెస్ట్ మ్యూల్ తో చుట్టూ కప్పబడి ఉంది.
ఇక్కడ చూసిన ఫోటోల నుంచి, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ లో ఉపయోగించిన అల్లాయ్ వీల్స్ 2024 హ్యుందాయ్ క్రెటాలో ఉపయోగించినట్లు తెలుస్తుంది. కాకపోతే ఇది ఒక రీఫ్రెష్ వెర్షన్ లా ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్, మార్పులు చేయబడిన హెడ్ ల్యాంప్ సెటప్, కొత్త టెయిల్ లైట్స్, ఇంకా ఓఆర్‍విఎంస్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్ రెయిల్స్ ఉండవచ్చు. ఇంతకుముందు దానితో పోలిస్తే ఇందులో కొత్త గ్రిల్, ట్వీక్ చేయబడిన ఫ్రంట్ మరియు రేర్ బంపర్స్, స్కిడ్ ప్లేట్స్ మరియు టెయిల్ గేట్ ఉండనున్నాయి.
ఇంటీరియర్ పరంగా చూస్తే ఫేస్ లిఫ్టెడ్ క్రెటాలో రీవర్క్ చేసిన ఇంటీరియర్ థీమ్, కొత్త అప్ హోల్స్స్టరీ, ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ కెమెరా ఇంకా ఎన్నో ఉంటాయి. అలాగే ఇందులో పనోరమిక్ సన్‍రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, పూర్తి డిజిటల్ ఇన్‍స్ట్రుమెంట్ కన్సోల్, డ్రైవ్ మోడ్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి.
మాకు తెలిసిన మరికొన్ని వివరాల ప్రకారం, కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‍లిఫ్ట్ లో ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఒకే విధమైన 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ మరియు 1.5-లీటర్ డీజిల్ మిల్ ఉండవచ్చు. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ లేదా 7-స్పీడ్ డిసిటి యూనిట్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉంది. BS6 ఫేజ్-2 నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత నిలిపివేయబడిన 1.4-లీటర్ వెర్షన్‌ను ఈ పవర్‌ట్రెయిన్ భర్తీ చేస్తుంది.
అనువాదించిన వారు : సంజయ్ కుమార్