- అందుబాటులోఉండనున్న7వేరియంట్స్
- పెట్రోల్ మరియు డీజిల్ రకాలలో అందుబాటులోకి రానున్న 2024క్రెటా
హ్యుందాయ్ తన అధికారిక లాంచ్‌కు ముందే ఇండియన్ మార్కెట్ లో క్రెటా ఫేస్‌లిఫ్ట్ యొక్క బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు ఈ 5- సీటర్ ఎస్‌యువిని ఏదైనా హ్యుందాయ్ అధికారిక డీలర్‌షిప్‌లో లేదా ఈ బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రూ. 25,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఇప్పటికే ఉన్న క్రెటా బుకింగ్ హోల్డర్‌లు తమ బుకింగ్‌ను ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌కి మార్చుకునే అవకాశాన్ని హ్యుందాయ్ కలిగించింది.
కొత్త క్రెటా 6 మోనోటోన్‌లు మరియు ఒక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో మరియు E, EX, S, S(O), SX, SX టెక్ SX(O) అనే 7 వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. మోనోటోన్ షేడ్స్‌లో రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, ఫైరీ రెడ్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్ మరియు టైటాన్ గ్రే ఉన్నాయి. మరోవైపు, డ్యూయల్-టోన్, బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్ కలర్ లో అందుబాటులో ఉంది.
క్రింది హుడ్లో, కియా సెల్టోస్-పోటీగా ఉన్న 2024క్రెటా మూడు పవర్‌ట్రెయిన్‌లలో అందించబడుతుంది - అలాగే ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ లతో అందించబడుతుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iVT, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ద్వారా నిర్వహింబడనున్నాయి.
ఫీచర్స్ పరంగా చూస్తే, ఈ 2024 క్రెటాలో 360-డిగ్రీ కెమెరా, మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త ఎయిర్‌కాన్ ప్యానెల్, మొబైల్ కనెక్టివిటీతో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ అందుబాటులోకి రానుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప