- రేపే లాంచ్ కానున్న క్రెటా ఫేస్‍లిఫ్ట్
- 7 వేరియంట్లలో లభ్యం
దేశవ్యాప్తంగా హ్యుందాయ్ ఇండియా క్రెటా ఫేస్‍లిఫ్ట్ ను రేపే అనగా జనవరి 16, 2024న లాంచ్ చేయనుంది. ఓ రకంగా చెప్పాలంటే కొరియన్ ఆటోమేకర్ కి ఇండియాలో ఇదే భారీ లాంచ్ అని చెప్పవచ్చు. అధికారికంగా హ్యుందాయ్ వెల్లడించక ముందే దీని బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, ఎస్‍యూవీ యొక్క ఎంట్రీ-లెవెల్ బేస్ వేరియంట్ డీలర్ షిప్ వద్ద కనిపించింది.
ఇక్కడ ఫోటోలలో కనిపించిన విధంగా, క్రెటా ఫేస్‍లిఫ్ట్ కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో రీడిజైన్డ్ ఫ్రంట్ ఫాసియా, బ్లాక్డ్-అవుట్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, మరియు ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్ వంటి వాటిని పొందింది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, కొత్తగా కనిపిస్తున్న వేరియంట్ లో అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్, కీలెస్ ఎంట్రీ, రియర్ వైపర్, రియర్ డీఫాగర్ వంటి ఫీచర్స్ మాత్రం లేవు.
ఇంటీరియర్ పరంగా చెప్పాలంటే, క్రెటా బేస్ వేరియంట్ చిన్న8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఏసీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఐఆర్‌విఎం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం మరియు డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ వంటి ఫీచర్లను పొందనుంది.
మెకానికల్ గా, హ్యుందాయ్ క్రెటా ఫేస్‍లిఫ్ట్ 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే 3 పవర్ ట్రెయిన్లతో రానుంది. ఇక పోటీ విషయానికి వస్తే, ఈ ఎస్‍యూవీ మిడ్ సైజ్ సెగ్మెంట్లో కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, ఎంజి ఆస్టర్, హోండా ఎలివేట్ మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ వంటి మోడల్స్ తో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్