- 3 పవర్ ట్రెయిన్లలో అందించబడుతున్న కొత్త క్రెటా
- ఇండియాలో రూ.11 లక్షలతో ప్రారంభంకానున్న క్రెటా ధరలు
హ్యుందాయ్ కంపెనీ క్రెటా ఫేస్‍లిఫ్ట్ ని ఇండియాలో రూ.11 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అప్‍డేటెడ్ మిడ్-సైజ్ ఎస్‍యూవీని మొత్తంగా 7 వేరియంట్లలో 3 పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. కొత్త క్రెటాకు సంబంధించి వేరియంట్లు, కలర్ ఆప్షన్లు, మరియు వెయిటింగ్ పీరియడ్ వివరాలను కలిగి ఉన్నాము. ఇప్పుడు, మనం ఈ ఆర్టికల్ లో లేటెస్ట్ గా లాంచ్ అయిన క్రెటా ఫేస్‍లిఫ్ట్ యొక్క ఇంజిన్-వారీ ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ మైలేజీని తెలుసుకుందాం.
పవర్ ట్రెయిన్స్ పరంగా చూస్తే, క్రెటాఫేస్‍లిఫ్ట్ 3 ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అవి 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. అలాగే ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, సివిటి యూనిట్, 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సు ద్వారా నిర్వహించబడతాయి.
కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క ఇంజిన్-వారీగా ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఈ క్రింద ఇవ్వబడింది:
ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ఫ్యూయల్ ఎఫిషియన్సీ |
1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ | 6ఎంటి | 17.4కెఎంపిఎల్ |
6ఐఎంటి | 17.7కెఎంపిఎల్ | |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ | 7డిసిటి | 18.4కెఎంపిఎల్ |
1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ | 6ఎంటి | 21.8కెఎంపిఎల్ |
6ఎటి | 19.1కెఎంపిఎల్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్