- రూ.11 లక్షల నుండి రూ. 20.15 లక్షలు (ఎక్స్-షోరూం) మధ్య ఉన్న క్రెటా ధరలు
- పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్లలో 7 వేరియంట్లలో అందించబడుతున్న మోడల్
తాజాగా లాంచ్ అయిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ మిడ్-సైజ్ ఎస్యూవీ ద్వారా హ్యుందాయ్ ఇండియా సరికొత్త మైల్‌స్టోన్‌కి చేరువయింది. కియా సెల్టోస్ తో పోటీపడుతున్న ఈ మోడల్ బుకింగ్స్ ప్రారంభమైన నెలలోపే ఈ ఆటోమేకర్ 51,000 యూనిట్ల బుకింగ్ సాధించింది.
ప్రస్తుతం, క్రెటా పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో, 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ 5-సీటర్ ఎస్‌యూవీని 6 మోనోటోన్స్ మరియు ఒక డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్ కలర్ నుండి ఎంచుకోవచ్చు. మోనోటోన్ కలర్లలో రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, ఫియరీ రెడ్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్ మరియు టైటాన్ గ్రే ఉన్నాయి. మరోవైపు బ్లాక్ రూఫ్ తో అట్లాస్ వైట్ అనే డ్యూయల్-టోన్ లో అందుబాటులో ఉంది. క్రెటా ధరలు రూ.11 లక్షల నుండి రూ. 20.15 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి.
అప్డేటెడ్ క్రెటాను హ్యుందాయ్ మూడు పవర్ ట్రెయిన్లలో అందిస్తుంది, అందులో 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐవిటి, 6-స్పీడ్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
2024 క్రెటా కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ మరియు స్కోడా కుషాక్ లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్