- 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించనున్న ఈవీ మోడల్
- ఎడాస్ (ఏడీఏఎస్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, మరియు మరెన్నో ఫీచర్లతో రానున్న క్రెటా ఈవీ
జనవరి-2025లో క్రెటా-బేస్డ్ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి హ్యుందాయ్ ఇండియా సన్నాహాలు చేస్తుంది. ఈ ఏడాది చివరిలోపు ప్రొడక్షన్ ని వెళ్లనుండగా, దీనిని క్రెటా ఈవీగా పిలిచే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత, ఈ మోడల్ ప్రీమియం లుక్ ని పొంది ఐసీఈ ట్విన్ మోడల్ అయిన హ్యుందాయ్ క్రెటాతో పాటుగా విక్రయించబడనుంది.
డిజైన్ పరంగా, క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ చాలా వరకు ఫీచర్లను ఐసీఈ క్రెటా మోడల్ నుంచి పొందనుంది. ఇందులో ఛార్జింగ్ పోర్ట్ తో బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, కనెక్టింగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ తో రియర్ స్పాయిలర్, రూఫ్-రెయిల్స్, మరియు కొద్దిగా ట్వీక్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ మోడల్ ఏరో-ప్యాటర్న్డ్ అల్లాయ్ వీల్స్ ని కూడా పొందనుంది.
క్రెటా ఈవీ స్టాండర్డ్ క్రెటా లాగే ఒకే రకమైన ఫీచర్లతో రానుంది. ఇది ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ డిస్ ప్లే, వైర్ లెస్ ఛార్జర్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లను పొందనుంది.
బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ మోడల్ కి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని హ్యుందాయ్ కంపెనీ వెల్లడించలేదు. అయితే, ప్రస్తుత ఈవీ కార్లలో ఉన్నట్లుగానే సింగిల్ ఛార్జ్ తో 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించే నార్మల్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్