- ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ
- ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆధారంగా రానున్న అవకాశం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చే నెలల్లో స్పెక్ట్రమ్‌లో ధర, బాడీ స్టైల్, మరియు సెగ్మెంట్ లలో అనేక రకాల (వివిధ)ఈవీలు లాంచ్‌కానున్నాయి. మిడ్-సైజ్ ఎస్‌యువి సెగ్మెంట్ లో మాత్రమే వివిధ ఈవీ కార్ల రాక కోసం ఎదురు చూస్తుండగా, వాటిలో ఒకటి క్రెటా ఈవీ కూడా ఉంది.
పబ్లిక్ రోడ్ పై టెస్ట్ చేస్తూ కనిపించిన, కొత్త స్పై షాట్‌లు హ్యుందాయ్ క్రెటా ఈవీ లో రెండు యూనిట్లను వెల్లడించాయి, ఇవి మునుపటి స్పై చిత్రాలతో పోలిస్తే కొద్దిగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉన్నాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న ఐసిఇ-పవర్డ్ తో పనిచేసే క్రెటా మాదిరిగానే టెయిల్‌లైట్ డిజైన్‌ను ఇక్కడ చూడవచ్చు. ఈ యూనిట్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ సెటప్‌ను పొందుతుంది. దీని అల్లాయ్ వీల్ డిజైన్ అయితే ఖచ్చితంగా మారే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు.
మరోవైపు, 2024 హ్యుందాయ్ క్రెటా ఈవీ ఏడీఏఎస్(ఎడాస్) సూట్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యాష్‌బోర్డ్‌లో డ్యూయల్ స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు న్యూ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుందని మేము ఆశిస్తున్నాము.
కొత్త క్రెటా ఈవీ పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి తక్కువగా ఉన్నప్పటికీ, ఇది 50-60kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని, దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500కిమీల రేంజ్ ని అందిస్తుందని భావిస్తున్నాం. అలాగే, క్రెటా ఈవీ లాంచ్ తర్వాత, టాటా హారియర్ ఈవీ, హోండా ఎలివేట్ ఈవీ మరియు మారుతి eVX లకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప