- ఈ సంవత్సరం చివరలో ప్రారంభంకానున్న క్రెటా ఈవీప్రొడక్షన్
- 2030 నాటికి వచ్చే 5 కొత్త ఈవీలలో ఇది ఒకటి
ఇంతకుముందు కనిపించిన హ్యుందాయ్ క్రెటా, మరొకసారి టెస్టింగ్ చేస్తూ దర్శనమిచ్చింది, మహారాష్ట్రలోని పూణేలోని ఛార్జింగ్ స్టేషన్‌లో టెస్టింగ్ చేస్తూ కనిపించగా, మాకు లభించిన ఒక సింగిల్ ఇమేజ్, లాంచ్ అయ్యే సమయానికి ఇది కీలక ఫీచర్‌తో అందించాబడుతుందని నిర్ధారిస్తుంది.
న్యూ క్రెటా ఈవీ భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉండగా, దీని అద్దంపై బ్లైండ్ స్పాట్ మానిటర్ ఉన్నట్లు వెల్లడైంది, మారుతి eVX కి పోటీగా ఉన్న న్యూ క్రెటా ఇప్పుడు 360-డిగ్రీ కెమెరా సెటప్‌తో వస్తుందని సూచిస్తుంది. మునుపటి స్పై షాట్‌లో కూడా ఏడీఏఎస్ (ఎడాస్) సూట్‌ని కూడా నిర్ధారించగా, ఇది ఐసిఇ -బేస్ వేరియంట్ వలె లెవెల్ 2 సెటప్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి డిజైన్‌లో మార్పులకు సంబంధించిన వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఏరో ఇన్సర్ట్‌లతో కూడిన న్యూ వీల్స్ ను మనం చూడవచ్చు. ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఈవీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కారు కలర్ ఫుల్ హైలైట్‌లతో ఈవీ-స్పెసిఫిక్ ఇన్‌సర్ట్‌లను పొందవచ్చని మేము భావిస్తున్నాము.
2024 క్రెటా ఎలక్ట్రిక్ 50-60kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి వచ్చే అవకాశం ఉంది, ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500కిమీల రేంజ్ నిఇస్తుందని భావిస్తున్నాం. లాంచ్ తర్వాత ఇది మారుతి eVX, హోండా ఎలివేట్ ఈవీ మరియు టయోటా నుంచి వచ్చే eVX వాటితో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప