- క్రెటా ఐసీఈతో పాటుగా విక్రయించబడే అవకాశం
- క్రెటా ఫేస్‍లిఫ్ట్ ఆధారంగా వస్తున్న క్రెటా ఈవీ
హ్యుందాయ్ నుంచి మనం ఆశించే భారీ అంశం ఏంటి అంటే, క్రెటా ఎస్‍యూవీ ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ లో రానుంది. పాపులర్ మోడల్ త్వరలో ఈవీగా దాని కొత్త పవర్‌ట్రెయిన్‌ను వచ్చే సంవత్సరంలో అందుకోనుంది. ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం చివరలో డిసెంబర్‌లో ప్రారంభం కానుంది.
ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ ఇప్పుడు అప్‍డేటెడ్ క్రెటా ఈవీ ఆధారంగా వస్తుంది. తాజాగా ఇంటర్నెట్లో వైరల్ గా మారిన స్పై ఫోటోలలో చూస్తే, ఈ ఈవీ మోడల్ బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, రీడిజైన్డ్ బంపర్, ఏరో-డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్-ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ వంటి కొన్ని ఫీచర్లతో రానుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, క్రెటా ఈవీలో మల్టీమీడియా మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం డ్యూయల్ డిస్‌ప్లేలు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కొత్త స్టీరింగ్ వీల్, స్టీరింగ్ కాలమ్-మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్ మరియు ఏసీ వెంట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త సీటు అప్హోల్స్టరీ వంటి ఫీచర్లతో రానుంది.
ఇంకా చెప్పాలంటే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లను పొందుతుంది.
బ్యాటరీ ప్యాక్ సైజ్ మరియు డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే, క్రెటా ఈవీ 50kWh నుండి 60kWh బ్యాటరీ యూనిట్‌తో రానుండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ తో అందించబడుతుందని మేము భావిస్తున్నాము. లాంచ్ అయిన తర్వాత, క్రెటా EV సెగ్మెంట్‌లో ఉన్నఎంజి ZS ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400, టాటా కర్వ్ ఈవీ మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి కార్లతో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్