- లాంచ్ అయిన ఆరు నెలల్లోపే ఈ మైలురాయిని సాధించిన మోడల్
- ప్రతిరోజూ 550 యూనిట్లకు పైగా అమ్ముడవుతున్న క్రెటా
హ్యుందాయ్ ఇండియా ఇటీవలి దాని మోడల్ క్రెటా ఎస్‌యువితో భారీ మైలురాయిని సాధించింది. ఈ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యువి ఇండియాలో లాంచ్ అయినప్పటి నుండి లక్ష యూనిట్ల విక్రయాలను అధిగమించింది. అయితే, ఈ మైలురాయిలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఈ విజయాన్ని సాధించడానికి దీనికి అతి తక్కువ సమయం పట్టింది అని చెప్పవచ్చు.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ జనవరి 2024లో లాంచ్ అయినప్పటికీ, కేవలం ఆరు నెలల్లోనే, ఈ మోడల్ 1 లక్ష అమ్మకాలను దాటింది. అంటే, సగటున చూస్తే ప్రతిరోజూ 550 యూనిట్లకు పైగా క్రెటా కార్లు విక్రయించబడ్డాయి.
హ్యుందాయ్ క్రెటాను 7 వేరియంట్‌లలో పొందవచ్చు. ధర విషయానికొస్తే, ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11 లక్షలు ఉండగా టాప్-వేరియంట్ ధర రూ. 20.15 లక్షలుగా ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇండియాలో క్రెటా పాపులారిటీని సంపాదించడానికి ఉన్న కారణాలలో ఒకటి ఏంటి అంటే ఈ ఎస్‌యువి ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్ తో వచ్చింది అని చెప్పవచ్చు. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ కోసం ట్విన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ ఫీచర్లన్నీ క్రెటాను దాని కేటగిరిలో ఉన్న మోడల్స్ కంటే ఎక్కువ ఫీచర్-రిచ్ అందిస్తున్న మోడల్ లో ఒకటిగా ఉంచుతుంది.
మెకానికల్‍గా, క్రెటాను 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ మోటార్ అనే మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పొందవచ్చు .
ఈ ఘనతపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, 'కొత్త హ్యుందాయ్ క్రెటా 2024 యొక్క విశేషమైన విజయంతో మేము థ్రిల్డ్‌గా ఉన్నాము. మా ఎస్‌యువి లక్ష విక్రయాలతో మరో మైలురాయిని సాధించింది, దాని సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉంది. హ్యుందాయ్ క్రెటా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం మరియు కస్టమర్లను ఆహ్లాదపరుస్తుంది అని మేము విశ్వసిస్తున్నాము” అని తెలియజేసారు.
అనువాదించిన వారు: రాజపుష్ప