- రూ.11 లక్షలుగా ఉన్న ప్రస్తుత ధర
- త్వరలోనే లాంచ్ కానున్న N లైన్ వెర్షన్
అప్‍డేటెడ్ హ్యుందాయ్ క్రెటా జనవరిలో లాంచ్ కాగా, ఇప్పటికే 75,000 యూనిట్ల బుకింగ్స్ సాధించి ఇండియాలో సరికొత్త మైల్‍స్టోన్‍ని క్రియేట్ చేసింది. నెలలోపే, ఈ ఆటోమేకర్ దాదాపుగా 24,000 ఆర్డర్లను అందుకోగా, దానిని అధిగమిస్తూ ఫిబ్రవరి-2024లో రికార్డు స్థాయిలో 51,000 బుకింగ్స్ సాధించింది. ఇంకా చెప్పాలంటే, బ్రాండ్ తాజాగా ఇండియాలో 10 లక్షలకు పైగా హ్యుందాయ్ క్రెటా కార్లను విక్రయించి సేల్స్ కింగ్ గా నిలిచింది.
ప్రస్తుతం ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా రూ.11 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. మొత్తంగా దీనిని E, EX, S, S(O), SX, SX టెక్, మరియు SX(O) అనే 7 వేరియంట్లలో పొందవచ్చు. ఇక కలర్ ఆప్షన్ల పరంగా, హ్యుందాయ్ క్రెటాఅబిస్ బ్లాక్ పెర్ల్, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, ఫియరీ రెడ్, రేంజర్ ఖాకీ, టైటాన్ గ్రే, అట్లాస్ వైట్ మరియు అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్ (డ్యూయల్-టోన్)తో సహా 7 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.
ఈ పాపులర్ ఎస్‍యూవీ 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. ఇక దీని మోటార్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐవిటి/ఐఎంటి, 6-స్పీడ్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సు వంటి వివిధ గేర్ బాక్సు ఆప్షన్లతో జత చేయబడ్డాయి.
ఇతర వార్తలలో చూస్తే, ఈ కొరియన్ ఆటోమేకర్ క్రెటా యొక్క పెర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ N లైన్ వెర్షన్ ని 11 మార్చి, 2024న దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ ఎస్‍యూవీ యొక్క ఎక్స్‌టీరియర్, వేరియంట్స్, కలర్ ఆప్షన్స్, పవర్ ట్రెయిన్, సేఫ్టీ ఫీచర్స్, మరియు వెయిటింగ్ పీరియడ్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కలిగి ఉన్నాము. వీటన్నింటిని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మా కార్‌వాలే వెబ్ సైట్ ని సందర్శించాలని కోరుతున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్