- లేటెస్ట్ గా లాంచ్ అయిన క్రెటా నుండి తీసుకున్నట్లు అనిపించే అల్కాజార్ ఫీచర్లు
- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం
హ్యుందాయ్ఇండియా తాజాగా క్రెటా ఫేస్‍లిఫ్ట్ దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది మరియు ఇప్పుడు మరికొన్ని వారాలలో దాని N లైన్ వెర్షన్ ని ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అదే విధంగా, ఈ ఆటోమేకర్ క్రెటా-బేస్డ్ మూడు వరుసల ఎస్‍యూవీ అయిన అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేయడం కూడా ప్రారంభించింది. ఓ రకంగా హ్యుందాయ్ కార్లను ఇష్టపడే కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
తాజాగా ఈ మోడల్ టెస్టింగ్ చేస్తుండగా, మందంగా ఉండే నల్లని కామోఫ్లేజ్ మాస్కుతో చాలా వరకు దీని ఎక్స్‌టీరియర్ భాగం కప్పి ఉండడం కనిపించింది. అయితే, టెస్ట్ మ్యూల్ లో గుర్తించాల్సిన అంశంలో డ్యూయల్-టోన్ కలర్లో కొత్త సెట్ అల్లాయ్ వీల్స్ఉన్నాయి. అదనంగా, 360-డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్‌ను చేర్చడానికి సూచనగా ఉండే ఓఆర్‍విఎంల క్రింద అమర్చబడిన కెమెరాతో టెస్ట్ మ్యూల్‌ను మీరు చూడవచ్చు.
అంతే కాకుండా, అప్‍డేటెడ్ అల్కాజార్ కొత్త గ్రిల్ తో రీడిజైన్డ్ ఫ్రంట్ ఫాసియా, కనెక్టెడ్ ఎల్ఈడీడీఆర్ఎల్స్, మరియు రివైజ్డ్ బంపర్ ని పొందనుంది. ఎక్స్‌టర్ మరియు శాంటా ఫే (గ్లోబల్) లాగా ఇందులో కూడా హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్‌లలో 'H-షేప్డ్' ప్యాటర్న్ ని హైలైట్ చేయవచ్చని మేము భావిస్తున్నాము.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఇంతకు ముందున్న అల్కాజార్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, 360-డిగ్రీ కెమెరా మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఎన్నో టెక్ ఫీచర్లతో వచ్చింది. అయితే, ఈ ఫేస్‍లిఫ్టెడ్ అల్కాజార్ క్రెటాలో ఉన్న డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్)సూట్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ మరియు పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ముందు వరుస సీట్లు వంటి ఫీచర్లను పొందనుంది.
మెకానికల్ గా, అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ ఇంతకు ముందున్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ మోటార్ వంటి పవర్ ట్రెయిన్ ఆప్షన్లను ఇందులో కూడా కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాం. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డిసిటి మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ఉండనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్