- సెప్టెంబర్ 9న ఇండియాలో లాంచ్ కానున్న అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్
- పెట్రోలు మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్స్ రెండింట్లో లభించనున్న మోడల్
హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ చుట్టూ హైప్ ఎప్పటికప్పుడు కొత్తగా పెరుగుతూ ఉంది. ఈ మూడు వరుసల ఎస్‌యువి సెప్టెంబర్ 9వ తేదీ 2024న లాంచ్ కానుందని, దీని అన్ని వేరియంట్స్ ధరలు కూడా లాంచ్ సమయంలో ప్రకటించబడతాయి అని కంపెనీ పేర్కొంది. అదనపు జత సీట్లతో పాటు, అల్కాజార్ ఎవర్‌గ్రీన్ క్రెటా కంటే ఎక్కువ ఫీచర్లను పొందుతుంది. ప్రస్తుతం రూ. 21,000 అమౌంట్ తో అల్కాజార్బుకింగ్‌లు ప్రారంభమ్యాయి.
అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఇండియాలో (ఎన్ఎఫ్ సి కార్డ్ కీ) ఎన్ఎఫ్ సి టెక్నాలజీతో కూడిన డిజిటల్ కీతో రానున్న మొదటి హ్యుందాయ్ మోడల్ ఇదే. కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను డోర్ హ్యాండిల్‌కు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా కారును లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. అంతేకాకుండా మరింత టెక్ ఫీచర్స్ ను ఇష్టపడే కస్టమర్ల కోసం, గరిష్టంగా ముగ్గురు వేర్వేరు కస్టమర్ల తో లేదా గరిష్టంగా ఏడు విధాలుగా లింక్ చేసిన పరికరాలతో ఒకేసారి డిజిటల్ కీని డ్రైవ్ చేయడానికి మరియు షేర్ చేయడానికి అనుమతిస్తుంది.
ఫీచర్స్ పరంగా చెప్పాలంటే, క్రెటా మాదిరిగానే, అల్కాజార్ లో కూడా రెండు డిజిటల్ స్క్రీన్‌లు లభిస్తాయి, ఈ రెండూ 10.25-ఇంచ్ లో ఉంటాయి. మరోవైపు, టచ్-సెన్సిటివ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, డ్యూయల్-జోన్ ఏసీ, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, ముందు మరియు రెండవ వరుసల కోసం వెంటిలేటెడ్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, రెండవ వరుస వైర్‌లెస్ ఛార్జర్, మాగ్నెటిక్ ప్యాడ్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లను పొందనుంది.
కొత్త హ్యుందాయ్ అల్కాజార్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో 6-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి రానుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప