- కొత్త క్రెటా లాగే ఇందులో కూడా మార్పులతో వచ్చిన అల్కాజార్
- పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను పొందిన నయా క్రెటా
రెండు రోజుల క్రితం జరిగిన అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ ఈవెంట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా దీని ధరలను కూడా ప్రకటించింది. పెట్రోల్ వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు రూ.14.99 లక్షలతో ప్రారంభమవ్వగా, డీజిల్ వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు రూ.15.99 లక్షలతో ప్రారంభమయ్యాయి. కొత్త ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ అల్కాజార్ ఎస్‍యూవీలో కొత్తగా అందించబడిన అంశాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం.
మెరుగైన కాస్మోటిక్ అప్ డేట్స్
అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ కారు క్రెటా లాంగ్ వీల్ బేస్ వెర్షన్ ని కొనసాగిస్తుండగా, ఇందులోని డిజైన్ మార్పులను చూస్తే, ఈ కారు క్రెటా డిజైన్ ని పోలి ఉంటుంది. అల్కాజార్ కారు దాని లేటెస్ట్ ఇటరేషన్ ద్వారా కొత్త ఫేస్ ని పొందగా, అందులో హెచ్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో బోల్డ్ గ్రిల్ మరియు క్వాడ్-బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ వంటివి ఉన్నాయి. ఈ ఎస్‍యూవీ 18-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ తో రాగా, కారుకు ఇరువైపులా స్పోర్ట్స్ స్కిడ్ ప్లేట్స్ కలిగి ఉంది. 2024 అల్కాజార్ రీడిజైన్డ్ టెయిల్ గేట్, రీస్కల్ప్ బంపర్, కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, మరియు ఎల్ఈడీ లైట్ బార్ వంటి వాటిని కలిగి ఉంది.
వేరియంట్స్, సీటింగ్, మరియు కొత్త ఫీచర్లు
అల్కాజార్ కారు ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లో అందించబడింది. అలాగే, ఈ కారు ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం మరియు సిగ్నేచర్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని క్యాబిన్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కోసం రెండు 10.25-ఇంచ్ స్క్రీన్లను కలిగి ఉంది. అదేవిధంగా, కొత్త ఎస్‍యూవీ బోస్ 8-స్పీకర్ సౌండ్ సిస్టం, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, కారులోని మొదటి మరియు రెండవ వరుసలో వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి కొత్త ఫీచర్లతో వచ్చింది.
సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు
పైన పేర్కొన్న ఫీచర్లు మాత్రమే కాకుండా, కొత్త హ్యుందాయ్ అల్కాజార్ కొత్తగా సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను పొందింది. ఇందులో తొడ భాగంలో సపోర్ట్ అందించేలా విశాలమైన కుషన్స్, వింగ్-టైప్ హెడ్ రెస్ట్స్, మరియు రెండవ వరుసలో కూర్చున్న ప్యాసింజర్లకు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. అలాగే ఈ ఎస్‍యూవీ కారులో డిజిటల్ కీ, 19 సేఫ్టీ ఫీచర్లతో లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆల్-డిస్క్ బ్రేక్స్, మైర్యు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
పవర్ ట్రెయిన్ ఆప్షన్లు
అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ కారు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మొదటి టర్బో-పెట్రోల్ ఇంజిన్ 158bhp మరియు 253Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేసి పొందవచ్చు. మరోవైపు, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 114bhp మరియు 250Nm ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేసి పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్