- ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం
- 2024 క్రెటాకు అనుగుణంగా విజువల్ అప్‌డేట్‌లను పొందుతుందని అంచనా
ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ అల్కాజార్ స్పై షాట్‌లు మళ్లీ హల్చల్ చేస్తూ కనిపించాయి. ఈసారి, స్పై షాట్‌లు ఈ సంవత్సరం చివరి నాటికి ఇండియాలో లాంచ్ చేయబడే ఈ మోడల్ కి సంబంధించి కీలకమైన ఫీచర్ ని వెల్లడిస్తున్నాయి.
స్పై షాట్‌లలో చూసినట్లుగా, 2024 హ్యుందాయ్ అల్కాజార్ నిలువుగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ రిఫ్రెష్ చేయబడిన సెట్‌ను పొందుతుంది. ఈ కారు భారీగా కప్పబడినప్పటికీ, కొన్ని కనిపించే అంశాలలో రూఫ్ రెయిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ట్విన్-టిప్ ఎగ్జాస్ట్స్ మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వంటివి ఉన్నాయి.
మరోవైపు, అప్‌డేట్ చేయబడిన అల్కాజార్‌లో రివైజ్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, న్యూ అప్హోల్స్టరీ, సరికొత్త గ్రిల్ మరియు ఇటీవలే 2024 హ్యుందాయ్ క్రెటా లిస్ట్ లో ఉన్న అదనపు ఫీచర్ల సెట్‌ను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము.
క్రింది హుడ్ లో, కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జత చేయబడి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో వచ్చే అవకాశం ఉంది. అలాగే , అల్కాజార్ లాంచ్ అయిన్పటి నుండి ఇది మొదటి అప్‌డేట్ అని చెప్పవచ్చు. ఈ అప్‌డేట్స్ టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్, మహీంద్రా XUV700 మరియు ఎంజి హెక్టర్ ప్లస్ వంటి వాటితో తలపడేలా కారును ఎనేబుల్ చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప