- ఇండియాలో అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ధరలు పండుగ సీజన్‌లో వెల్లడి అయ్యే అవకాశం
- ఏడీఏఎస్(ఎడాస్) సూట్‌ని పొందుతుందని అంచనా
ఈ సంవత్సరం చివర్లో, పండుగ సీజన్‌లో హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఇండియాలో రాబోతుందని, హ్యుందాయ్ పోటీదారులుకు గట్టి పోటీనిచ్చేలా దాని అప్‌డేట్ మోడల్ ను తీసుకువస్తుందని భావిస్తున్నాం. అలాగే, వెబ్‌లో షేర్ చేసిన కొత్త స్పై షాట్‌లలో ఈ కారుకు సంబంధించిన కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి.
లాంచ్ సమయానికి 2024 హ్యుందాయ్ అల్కాజార్ సరికొత్త అల్లాయ్ వీల్స్‌తో రానుంది. అలాగే, స్పై షాట్‌లలో దీని కొత్త డిజైన్ వెల్లడవ్వగా, హ్యుందాయ్ ప్రస్తుత అందించబడుతున్న మోడల్ తో పోలిస్తే అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ సైజ్ లో కూడా పెద్దదిగా ఉండవచ్చు. అంతేకాక, ఈ మూడు-వరుసల ఎస్‌యువి కొత్త గ్రిల్, (రివైజ్డ్)మార్పులు చేసిన సెట్ బంపర్స్, ట్వీక్డ్ హెడ్‌ల్యాంప్ డిజైన్ మరియు రిఫ్రెష్ చేయబడిన టెయిల్‌లైట్ డిజైన్‌ను కూడా పొందుతుంది.
ఇది లోపలి భాగంలో, ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన క్రెటా ఫేస్‌లిఫ్ట్‌తో ఫీచర్స్ సరిపోలడానికి ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ అల్కాజార్ ఫీచర్ లిస్ట్ ను పొందుతుంది. వీటి ఫీచర్స్ విషయానికొస్తే, 10.25-ఇంచ్ స్క్రీన్స్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి.
లాంచ్ అయ్యే సమయానికి ఈ మోడల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఏ మాత్రం మారకుండా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కారులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో పాటు 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో జతచేయబడి అందించబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప