- కొత్త అల్లాయ్ వీల్స్ తో పాటుగా భారీ రీవర్కుతో కూడా ఫ్రంట్ ప్రొఫైల్ ని పొందనున్న అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా రానున్న హ్యుందాయ్ మోడల్
ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు వివిధ ఎస్‍యూవీలను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా, అందులో అల్కాజార్ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ మరియు ఆల్-ఎలక్ట్రిక్ క్రెటా కూడా ఉంది. ఇప్పుడు, మాకు అందిన సమాచారం ప్రకారం, ఈ బ్రాండ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్టును 2024పండుగ సీజన్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ సెప్టెంబర్-అక్టోబర్ మధ్య దాని అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇదే టెస్ట్ మ్యూల్ ఎన్నోసార్లు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇంతకు ముందున్న అల్కాజార్ వలె కాకుండా, ఈ అప్ డేటెడ్ మూడు-వరుసల ఎస్‍యూవీ లేటెస్ట్ క్రెటా అధారంగా వచ్చిన రీవర్క్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్ ని పొందుతుంది.
స్పై ఫోటోలలో చూసిన విధంగా, ఇందులోని ఎక్స్‌టీరియర్ హైలైట్లలో కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్, రెక్టాంగులర్-షేప్డ్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, హారిజాంటల్-స్లాట్ ప్యాటర్న్ గ్రిల్, ఎడాస్ (ఏడీఏఎస్) సెన్సార్ తో కూడిన రివైజ్డ్ బంపర్ ఉండనున్నాయి. అల్లాయ్స్ కూడా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధమైన ప్రొఫైల్ తో కొత్త డిజైన్ ని పొందనున్నాయి. ప్రస్తుతం, అల్కాజార్ 215/55 ప్రొఫైల్ లో 18-ఇంచ్ టైర్లతో అందించబడింది.
ఫీచర్ల పరంగా, అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డ్రైవర్ డిస్‌ప్లే కోసం ట్విన్ 10.25-ఇంచ్ స్క్రీన్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
మెకానికల్ గా, కార్ మేకర్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో ఎలాంటి మాప్రులు చేసే అవకాశం లేదు. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను ఇంతకు ముందులాగే అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ లో కొనసాగించనుంది.
లాంచ్ తర్వాత, అప్ డేటెడ్ హ్యుందాయ్ అల్కాజార్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారీ, టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టో మరియు కియా కారెన్స్ వంటి కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్