- పూర్తిగా రివైజ్డ్ ఫాసియాతో రానున్న అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్
- మల్టీ-స్పోక్ స్వర్ల్ ప్యాటర్న్ అల్లాయ్ వీల్స్ తో అందించబడుతున్న మోడల్
హ్యుందాయ్ ఇండియా ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి రానున్న అప్ కమింగ్ (రాబోయే) అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌ను పలు సందర్భాల్లో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ మూడు-వరుసల ఎస్‌యువి ఈ పండుగ సీజన్‌లో ఇండియాలో లాంచ్ కాబోతుండగా మరియు ముందున్న దాని కంటే సరికొత్త డిజైన్ అప్‌గ్రేడ్‌ను కలిగి ఉండనుంది.అల్కాజార్ టెస్ట్ మ్యూల్ కొత్త స్పై షాట్‌లు దాని ప్రొఫైల్ మరియు కొన్ని కొత్త అంశాలను వెల్లడిస్తున్నాయి.
చిత్రంలో చూసినట్లుగా, క్రెటా-ఆధారంగా మూడు-వరుసల ఎస్‌యువి సైడ్ ప్రొఫైల్ దాని డిజైన్‌లో ఎక్కువ భాగం అలాగే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఒక కొత్త అల్లాయ్ వీల్స్ రూపంలో గుర్తించదగిన మార్పును ఇందులో చూడవచ్చు. అలాగే, ఫ్రంట్ ఫెండర్స్ మరియు రియర్ ప్రొఫైల్ పూర్తిగా కప్పబడినప్పటికీ,ఆయా భాగాలలో మాక్సిమం మార్పులతో వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
మునుపటి స్పై చిత్రాలలో ఫ్రంట్ ఫాసియాలోని కొన్ని వివరాలు మా దృష్టిలో పడ్డాయి, ఇది భారీగా మార్పులు చేయబడిన మరియు క్రెటా ఫేస్‌లిఫ్ట్ కు పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అలాగే, పూర్తి-వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్, రివైజ్డ్ హారిజాంటల్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్స్, కనెక్ట్ చేయబడిన టెయిల్‌లైట్స్ మరియు కొత్త పెయింట్ స్కీమ్‌లు ఇందులోని ప్రధాన ముఖ్యాంశాలుగా ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే అల్కాజార్ ఎస్‌యువి ఇప్పటికే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి ఫీచర్లతో లోడ్ చేయబడింది.
అయితే, అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌తో లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు రివైజ్డ్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ వంటి మరిన్ని కొత్త ఫీచర్లతో రానుంది , ఎలా అంటేఇది క్రెటా ట్విన్-స్క్రీన్ సెటప్‌ను పోలి ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప