- మరికొన్ని నెలల్లో లాంచ్ అవుతుందని అంచనా
- లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) టెక్‌ని పొందే అవకాశం
హ్యుందాయ్ ఇండియా అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరికొన్ని నెలల్లో ఇండియాలో లాంచ్చేయడానికి ముందు చురుకుగా టెస్టింగ్ చేస్తుంది.ఈ మోడల్ కొత్త క్రెటా ఎస్‌యువి నుండి అనేక ఫీచర్లు మరియు టెక్నికల్,డిజైన్ అంశాలను పొందుతుంది.ఇటీవల, మూడు-వరుసల ఎస్‌యువి ముందు మరియు వెనుక ప్రొఫైల్స్ పై కామోఫ్లేజ్ తో కప్పబడి టెస్ట్ చేస్తూ కనిపించింది.
అప్‌డేటెడ్ అల్కాజార్ ఎక్కువ భాగం వరకు ముందు మరియు వెనుక విభాగాలలో భారీ మార్పులను పొందుతుంది. ముందు భాగంలో, ఈఎస్‌యువి క్రెటా మాదిరిగానే టర్న్ ఇండికేటర్‌లతో కనెక్ట్ చేసే డిఆర్ఎల్ ని కలిగి ఉంటుంది. ఆ తర్వాత, గ్రిల్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో సమాంతర స్లాట్ హారిజాంటల్ తో కొత్త లుక్ ను పొందుతుంది. అంతేకాకుండా, స్పై ఫోటోలను మరింత పరిశీలించినప్పుడు, ఏడీఏఎస్(ఎడాస్) టెక్ కోసం అమర్చిన రాడార్ సెన్సార్ స్పష్టంగా కనిపిస్తుంది, ఇది బంపర్‌లో ఇంటిగ్రేటెడ్ చేయబడింది.
ఈ కార్ సైడ్ ప్రొఫైల్ అవుట్‌గోయింగ్ వెర్షన్ ని పోలి ఉంటుంది.అయితే, ఈ అప్‌డేట్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ కొత్త అల్లాయ్ వీల్స్ ను పొందుతుంది.ఈ కార్ వెనుక వైపున, టెయిల్ ల్యాంప్స్ రీడిజైన్ చేయబడిన బంపర్‌లతో కనెక్ట్ అయ్యే లైట్ బార్ డిజైన్‌ను పొందుతాయని మేము ఆశిస్తున్నాము.
మెకానికల్‍గా, అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో కొనసాగుతుంది.లాంచ్ తర్వాత, అప్‌డేటెడ్ మూడు-వరుసల అల్కాజార్ ఇండియన్ మార్కెట్లో కియా కారెన్స్, ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారి, మహీంద్రా XUV700, టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు మహీంద్రా స్కార్పియో N లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప