- పూర్తిగా రివైజ్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను పొందుతుందని అంచనా
- కొత్త అల్లాయ్ వీల్స్‌ను పొందనున్న అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ ఇండియా మరికొన్ని నెలల్లో అల్కాజార్ ఎస్‌యువి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఇండియాలో లాంచ్ చేయనుంది.మూడు-వరుసల క్రెటా-ఆధారంగా వచ్చిన ఈ మోడల్ అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందించినప్పటికీ, మార్పులు చేసిన (రివైజ్డ్) డిజైన్ మరియు కొత్త ఫీచర్ల నుండి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే, ఇటీవలి స్పై చిత్రాలలో, ఫ్రంట్ డిజైన్ ద్వారా కీలక వివరాలు లీక్ అయ్యాయి.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ క్రెటా నుండి పూర్తిగా సరికొత్త లుక్ ని పొందుతుంది.కనెక్టింగ్ లైట్ బార్‌తో రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, రెక్టాంగులర్-షేప్డ్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సమాంతర (నేరుగా)స్లాట్స్ తో కూడిన కొత్త గ్రిల్ మరియు రివైజ్డ్బంపర్ వంటి మార్పులు ఉన్నాయి.
అంతేకాకుండా, అల్కాజార్ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యువి యొక్క వైఖరిని మరింత మెరుగుపరచడానికి కొత్త స్విర్ల్-ప్యాటర్న్డ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై రైడ్ చేయనుంది.కనెక్ట్ చేయబడిన ఫీచర్‌తో సర్దుబాటు చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో రివైజ్ చేయబడిన రియర్ ప్రొఫైల్‌ను కూడా పొందుతుందని భావిస్తున్నాం.
ఫీచర్ పరంగా చెప్పాలంటే, అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ లో ట్విన్ 10.25-ఇంచ్ డిస్‌ప్లేస్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్లతో లోడ్ చేయబడవచ్చు. ఇంకా చెప్పాలంటే, క్రెటా ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే, అప్‌డేట్ చేయబడిన అల్కాజార్ కూడా లెవెల్ 2ఏడీఏఎస్(ఎడాస్) సూట్‌ను పొందుతుంది.
మెకానికల్ గా, అల్కాజార్యొక్క పవర్‌ట్రెయిన్ ఎంపికలలో హ్యుందాయ్ ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు.ఎస్‍యూవీ 1.5-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో వస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల విషయానికొస్తే, ఇంజిన్‌లు ఆరు-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు డిసిటిగేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప