- ఇంతకు ముందు అందించబడిన ఇంజిన్ ఆప్షన్లతో రానున్న 2024అల్కాజార్
- సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్
2024 సెప్టెంబర్ 9వ తేదీన ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ అవ్వడానికి సిద్ధం కాగా, దీనికి తగిన ఏర్పాట్లను హ్యుందాయ్ పూర్తి చేసింది. ఇప్పుడు, లాంచ్ కి ముందుగా అప్ కమింగ్ (రాబోయే) మూడు-వరుసల ఎస్‍యూవీ ఎక్స్‌టీరియర్ డిజైన్, వేరియంట్లు, కలర్లు, మరియు పవర్ ట్రెయిన్ ఆప్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆటోమేకర్ వెల్లడించింది. ఈ ఆర్టికల్ ద్వారా, ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లో అందించబడనున్న కొత్త అల్కాజార్ లో లభించే ఇంజిన్ మరియు గేర్ బాక్సు వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
బానెట్ కింద, అప్ కమింగ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో రానుండగా, అందులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. మొదటి ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సులతో జతచేయబడి రానుంది. అదే విధంగా, ఇందులోని డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తి జతచేయబడి రానుంది.
వేరియంట్ వారీగా హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ లోని వివిధ పవర్ ట్రెయిన్ వివరాలు కింది విధంగా ఉన్నాయి:
హ్యుందాయ్ అల్కాజార్ | ఎగ్జిక్యూటివ్ | ప్రెస్టీజ్ | ప్లాటినం | సిగ్నేచర్ | |||||
6 సీటర్ | 7 సీటర్ | 6 సీటర్ | 7 సీటర్ | 6 సీటర్ | 7 సీటర్ | 6 సీటర్ | 7 సీటర్ | ||
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ | 6 ఎంటి | - | ఉంది | - | ఉంది | - | ఉంది | - | - |
7 డిసిటి | - | - | - | - | ఉంది | ఉంది | ఉంది | ఉంది | |
1.5-లీటర్ డీజిల్ | 6 ఎంటి | - | ఉంది | - | ఉంది | - | ఉంది | - | - |
6 ఎటి | - | - | - | - | ఉంది | ఉంది | ఉంది | ఉంది |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్