- కొత్త స్టైలింగ్ మరియు ఫీచర్ మార్పులను పొందనున్న 2024 అల్కాజార్
- పవర్ ట్రెయిన్లలో ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం
హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎన్నోసార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించింది. మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో హ్యుందాయ్ కంపెనీ మూడు-వరుసల ఎస్‍యూవీ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ ని ఇండియాలో లాంచ్ చేయనుంది.
కాస్మోటిక్ అప్ డేట్స్ పరంగా, అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ కారు ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన క్రెటా ఫేస్‍లిఫ్ట్ డిజైన్ ని పొందనుంది. ఇందులోని ముఖ్యమైన అంశాలలో కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కొత్త గ్రిల్, రీఫ్రెష్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ట్వీక్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ సెట్, మరియు రీవర్క్డ్ టెయిల్ గేట్ వంటివి ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా, 2024 హ్యుందాయ్ అల్కాజార్ లోపల ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటోమేటిక్ కంట్రోల్, రెండు 10.25-ఇంచ్ స్క్రీన్స్, రివైజ్డ్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ మరియు మరెన్నో ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
హ్యుందాయ్ అల్కాజార్ ప్రస్తుతం 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్లు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో జతచేయబడి అందించబడింది. అయితే, దాని స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా వాటినే అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ కూడా కొనసాగించే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత, అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ కారు ఎంజి హెక్టర్ ప్లస్, కియా కారెన్స్, టాటా సఫారీ, మరియు మహీంద్రా XUV700 వంటి వివిధ కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్