- సెప్టెంబర్ 9వ తేదీన ఇండియాలో కొత్త అల్కాజార్ ధరల వెల్లడి
- కొత్త ఫీచర్లు మరియు అప్ డేటెడ్ డిజైన్ ని పొందనున అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
హ్యుందాయ్ ఇండియా సెప్టెంబర్ 9వ తేదీన దేశవ్యాప్తంగా ఫేస్‍లిఫ్టెడ్ అల్కాజార్ ధరలను ప్రకటించడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు మనం చర్చిస్తున్న అప్ డేటెడ్ మూడు-వరుసల ఎస్‍యూవీ మహీంద్రా XUV700, కియా కారెన్స్, టాటా సఫారీ, మరియు ఎంజి హెక్టర్ ప్లస్ వంటి వివిధ బ్రాండ్లకు చెందిన కార్లతో పోటీపడుతుంది.
ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే, 2024అల్కాజార్ ఫ్రెష్ గ్రిల్ తో కొత్త ఫేసియాను, క్రెటాలో చూసినట్లుగా ఉన్న స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మరియు ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్ వంటి వాటిని పొందనుంది. ఈ కారు సైడ్ ప్రొఫైల్ పూర్తిగా ఒకేలా ఉంటుండగా, కొత్త అల్లాయ్ వీల్స్ సెట్ తో వస్తుందని భావిస్తున్నాం. ఇంకా కారు రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది రీడిజైన్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ మరియు రీవర్క్డ్ టెయిల్ లైట్స్ తో రానుంది, అలాగే కారు ముందు మరియు వెనుక భాగాలలో ఎల్ఈడీ లైట్ బార్స్ అందించబడుతుండగా, కొత్త కలర్ ఆప్షన్లతో కూడా రానుంది.
కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారు అల్కాజార్ కన్నా బెటర్ ఫీచర్లతో అప్ గ్రేడ్ చేయబడి రానుంది. ఇందులో లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, ట్విన్ 10.25-ఇంచ్ స్క్రీన్స్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్ లెస్ ఛార్జర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి.
హ్యుందాయ్ దాని అల్కాజార్ లాగే ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ ని తీసుకురానుంది. ఇది మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విక్రయించబడుతున్న అల్కాజార్ కారులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు ఇందులో కూడా వస్తుండగా, ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సులతో జతచేయబడి రానున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్