పరిచయం
ఈ సంవత్సరం ప్రారంభంలో హ్యుందాయ్ కంపెనీ డిజైన్ మరియు ఫీచర్ల పరంగా సెకండ్ జనరేషన్ క్రెటాకు సంబంధించి అతి పెద్ద అప్ డేట్ ని అందించింది. కారు లాంచ్ అయిన తర్వాత, డెవలప్ మెంట్లో భాగంగా అల్కాజార్ లాజికల్ స్టెప్ తో ముందడుగు వేస్తూ క్రెటా నుంచి అప్ డేట్లను తీసుకోవచ్చు.
ఇప్పుడు, ఈ కారు అధికారికంగా ఆవిష్కరించబడగా, కానీ ధరల ప్రకటన సెప్టెంబర్ 9వ తేదీకి షెడ్యూల్ చేయబడింది. లాంచ్ కి ముందుగా, అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేయబోతున్నాము. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఎక్స్‌టీరియర్ డిజైన్
కారు ఓవరాల్ షేప్ ప్రత్యేకంగా కనిపిస్తుండగా, గ్లోబల్ మోడల్స్ లో ఉన్న డిజైన్ లాంగ్వేజీని పొందుతుంది. ముఖ్యంగా, క్రెటాలో అందించబడిన వాటితో రానుంది.
కారు ముందు భాగంలో, అల్కాజార్ భారీ ఫ్రేమ్ తో వస్తుంది, కానీ ఇది కొత్తగా లో-సెట్ హెడ్ ల్యాంప్స్ ని మరియు హెచ్-షేప్డ్ డీఆర్ఎల్స్ ని పొందుతుంది. ప్రొఫైల్ లో మీరు దీనిని కొత్తగా ఫ్యాన్ లాంటి ప్యాటర్న్ తో 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని పొందుతారు.
ఇంకా కారు వెనుక భాగంలో అతిముఖ్యమైన మార్పుతో వస్తుండగా, హ్యుందాయ్ ఈ కారుకు భారీ అంశాలతో సిగ్నేచర్ లుక్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ని అందించింది. కొత్తగా మీరు రియర్ స్పాయిలర్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, మరియు బాష్ ప్లేట్ డిజైన్ ని పొందుతారు.
(అన్నీ ఎంఎంలలో)
పొడవు (ఎంఎం) | వెడల్పు | ఎత్తు | వీల్ బేస్ | గ్రౌండ్ క్లియరెన్స్ |
4500 | 1790 | 1675 | 2760 | 200 |
అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ కొలతలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అలాగే, ఈ కొత్త డిజైన్ ద్వారా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అల్కాజార్ కంటే ఈ కారు లుక్స్ మరింత బెస్ట్ గా ఉన్నాయి. బహుశా లుక్స్ ప్రధాన విషయంగానే ఉన్నా, ఇవి ఎక్కడ ప్రధాన పాత్రను పోషిస్తాయో తెలుసుకోవాలి.
పెట్రోల్
ప్రెస్టీజ్ | ప్లాటినం | ఎగ్జిక్యూటివ్ (కొత్తది) | సిగ్నేచర్ |
7సీటర్ | 6సీటర్/7సీటర్ | 7సీటర్ | 6సీటర్ |
వేరియంట్స్ మరియు కలర్స్
ప్రస్తుతం విక్రయించబడుతున్న అల్కాజార్ మోడల్ లాగే, అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ప్లాటినం, సిగ్నేచర్, ప్రెస్టీజ్, మరియు ఎగ్జిక్యూటివ్ వంటి వేరియంట్లలో అందించబడుతుంది.
డీజిల్
ప్రెస్టీజ్ | ప్లాటినం | ఎగ్జిక్యూటివ్ (కొత్తది) | సిగ్నేచర్ |
7S | 6S/7S | 7S | 6S |
ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ రేంజ్ రెండింట్లో వస్తుండగా, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ మాత్రం కేవలం ప్రెస్టీజ్, ప్లాటినం, ఎగ్జిక్యూటివ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది మొత్తం ఏడు సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందించబడనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఇది బ్లాక్ రూఫ్ తో అట్లాస్ వైట్ అనే ఒకే ఒక్క డ్యూయల్-టోన్ ఆప్షన్ ని కలిగి ఉంది.
పెట్రోల్ | డీజిల్ |
1.5-లీటర్ జిడిఐ- 158bhp/253Nm | 1.5-లీటర్-113bhp/250Nm |
6ఎంటి/7డిసిటి | 6ఎంటి/6ఎటి |
పవర్ ట్రెయిన్స్
అల్కాజార్ లో అందించబడుతున్న పవర్ ట్రెయిన్లను హ్యుందాయ్ ఎలాంటి మార్పులు లేకుండా ఇందులో తీసుకువస్తుంది. మీరు దీనిని హ్యుందాయ్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పొందవచ్చు. మొదటి జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ 158bhp/253Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, మీరు దీనిని 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో పొందవచ్చు. మరోవైపు, వెన్యూ కారు నుంచి ఈ కారు వరకు అన్నింట్లో కామన్ గా వస్తున్న హ్యుందాయ్ 1.5-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 113bhp/250Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని మీరు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో పొందవచ్చు.
ఫీచర్ లిస్టు మరియు క్యాబిన్
హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ క్యాబిన్ వివరాలను వెల్లడించగా, ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న వాటితో పోలిస్తే, ఈ కారులో బెస్ట్ క్యాబిన్ ని అందిస్తున్నట్లు చెప్పవచ్చు. ఫోటోలలో, హ్యుందాయ్ కంపెనీకి ఎప్పటినుంచో బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న కింగ్ ఖాన్ (షారుఖ్ ఖాన్)ని మీరు చూడవచ్చు. 6-సీటర్ కారులో కూర్చున్న షారుఖ్ ఖాన్ తన లెఫ్ట్ సైడ్ ఉన్న బాస్ మోడ్ ఫంక్షన్ ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు.
అలాగే ఇందులో కనిపిస్తున్న ముఖ్యమైన ఫీచర్లలో సీట్ బ్యాక్ ట్రే టేబుల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్జస్టబుల్ అండర్ థై(తొడ) సపోర్ట్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్,రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్, సెంట్రల్ ఏసీవెంట్స్ మరియు డ్యూయల్ యూఎస్‍బీ-సిఛార్జింగ్ పోర్ట్స్ వంటివి ఉన్నాయి. దీని క్యాబిన్ ని మీరు బ్లాక్ కలర్ కి బదులుగా బీజ్ కలర్ తో పొందవచ్చు. ఈ ఫీచర్లకు అదనంగా, అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మరియు ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ వంటి ఫీచర్లను పొందుతుంది.
ధర అంచనా మరియు పోటీ
పోటీ విషయానికి వస్తే, అల్కాజార్ కారు టాటా సఫారీ, మహీంద్రా XUV700, మరియు ఎంజి హెక్టర్ ప్లస్ వంటి కార్లతో పోటీపడుతుంది. ఇంకా ధర విషయానికి వస్తే, ప్రస్తుతం విక్రయించబడుతున్న కారుతో పోలిస్తే దీని ధర కొంచెం ఎక్కువగా ఉండనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్