- ఇండియాలో సెప్టెంబర్ 9వ తేదీన ధరల ప్రకటన
- 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో అందించబడనున్న మోడల్
ఈ వారం ప్రారంభంలో, హ్యుందాయ్ అప్‌డేటెడ్ మూడు-వరుసల ఎస్‌యువి వెల్లడించడంతో పాటు అధికారికంగా ఫేస్‌లిఫ్టెడ్ అల్కాజార్ బుకింగ్‌లను కూడా ఇండియాలో ప్రారంభించింది. ఈ కారును కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగిన కస్టమర్లు టోకెన్ మొత్తం రూ. 25,000 చెల్లించి ఫేస్‌లిఫ్టెడ్ అల్కాజార్ ని బుక్ చేసుకోవచ్చు. అలాగే, ఈ మోడల్ కు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఈ కథనంలో వేరియంట్ పేర్లు మరియు కలర్ ఆప్షన్స్ వివరాలను చూడండి.
వేరియంట్‌ల పరంగా చూస్తే, 2024 హ్యుందాయ్ ఆల్కజార్ - ప్లాటినం, సిగ్నేచర్, ప్రెస్టీజ్ మరియు ఎగ్జిక్యూటివ్ అనే 4 వేరియంట్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. ఇంతే కాకుండా, ఈ మోడల్ ను కస్టమర్లు అబిస్ బ్లాక్ పెర్ల్, అట్లాస్ వైట్, ఫియరీ రెడ్, రేంజర్ ఖాకీ, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, స్టార్రీ నైట్ మరియు టైటాన్ గ్రే మ్యాట్ వంటి 7 మోనోటోన్ షేడ్స్ నుంచి ఎంచుకోవచ్చు. మరోవైపు, అబిస్ బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్ అని పిలువబడే డ్యూయల్-టోన్ కలర్ లో మాత్రమే అందించబడుతుంది.
కొత్త అల్కా జార్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో మార్పులు చోటుచేసుకుంటుండగా, అందులో కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యూయల్ ఛాంబర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్ బార్‌తో కూడిన కొత్త గ్రిల్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లతో కూడిన రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త 18-ఇంచ్ డ్యూయల్-టోన్, అల్లాయ్ వీల్స్, మరియు పాలిసేడ్ స్ఫూర్తిగా నిలువుగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ ఉన్నాయి. టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుండగా, సరికొత్త రూఫ్ రెయిల్స్ తో వస్తుంది .
హుడ్ కింద, ఫేస్‌లిఫ్టెడ్ అల్కాజార్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్‌లతో జతచేయబడి వస్తుంది. ఈ ఎస్‌యువికి టాటా సఫారి, కియా కారెన్స్, ఎంజి హెక్టర్ ప్లస్ మరియు మహీంద్రా XUV700 వంటివి పోటీగా ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప