- ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ గురుగ్రామ్, మరియు బెంగళూరులో 6 డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
- ఢిల్లీ-చండీఘర్, ఢిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, మరియు ముంబై-నాసిక్ నేషనల్ హైవేలపై మరో ఐదు ఛార్జింగ్ స్టేషన్లు
హ్యుందాయ్ ఇండియా దేశవ్యాప్తంగా 11 డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పి దాని పబ్లిక్ చార్జింగ్ నెట్ వర్క్ ని మరింతగా విస్తరించింది. ఈ కార్ మేకర్ మొత్తం 11 కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పగా, అందులోని ఒక్కో యూనిట్లో డిసి 150kW, డిసి60kW మరియుడిసి30kW కెపాసిటీ ఛార్జర్లు ఉన్నాయి.
మొత్తం 11 ఛార్జర్లలో 6 ఛార్జర్లు ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, గురుగ్రామ్ మరియు బెంగళూరు అనే పెద్ద నగరాల్లో నెలకొల్పింది. మిగతా ఐదు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ-చండీఘర్, ఢిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, మరియు ముంబై-నాసిక్ వంటి పెద్ద నేషనల్ హైవేలపై నెలకొల్పింది. చాలా వరకు ఈ ఛార్జింగ్ స్టేషన్లను హ్యుందాయ్ వినియోగదారులు మరియు నాన్-హ్యుందాయ్ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద వెహికిల్స్ ఛార్జింగ్ కొనసాగుతుండగా కస్టమర్ల సౌకర్యార్థం కాఫీ షాపులు మరియు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.
ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్ల వద్ద 30kW ఛార్జర్ ద్వారా ఒక యూనిట్ కి 18 రూపాయలతో, 60kW ఛార్జర్ ద్వారా ఒక యూనిట్ కి 21 రూపాయలతో, 150kW ఛార్జర్ ద్వారా ఒక యూనిట్ కి 24 రూపాయలతో ఛార్జింగ్ సెషన్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కార్ మేకర్ యొక్క myHyundai స్మార్ట్ ఫోన్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఛార్జర్లకు అదనంగా, 2900 పైగా ఛార్జింగ్ పాయింట్లను ఇదే యాప్ లో హ్యుందాయ్ కస్టమర్లు మరియు నాన్-హ్యుందాయ్ ఈవీ యూజర్లు ఉపయోగించుకోవచ్చు.
2024లో ఇటువంటి ఫాస్ట్ డిసి ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా 10 లేదా అంతకంటే ఎక్కువగా కొత్త ప్రాంతాల్లో డిసి ఫాస్ట్ ఛార్జర్లను నెలకొల్పి వీటిని విస్తరించాలని హ్యుందాయ్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. అదనంగా, 2027 వరకు 100 ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని హ్యుందాయ్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగా జనవరి-2024లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ లో తమిళనాడు ప్రభుత్వంతో హ్యుందాయ్ ఒప్పందం కుదుర్చుకుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్