- ఎంజి హలోల్ ప్లాంట్‌లో ప్రతిరోజూ 250 నుండి 300 వాహనాలు తయారీ
- రంగులపై మహిళలకున్న మంచి అవగాహనతోపెయింట్ జాబ్ యూనిట్‌లో మహిళల ఆధిపత్యం
గుజరాత్‌లోని మోరిస్ & గ్యారేజెస్ హలోల్ ప్లాంట్ ద్వారా రోజుకు 250 నుండి 300 ఎంజి కార్స్ ఉత్పత్తి అవుతున్నాయి. మీకు తెలుసో, లేదో ఎంజి బెస్ట్ సెల్లింగ్ హెక్టర్ ను కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్లో సుమారు 950 నుండి 1,000 మంది మహిళలు పని చేస్తున్నారు.
ఎంజి మోటార్ ఇండియా, హ్యూమన్ రిసోర్సెస్ సీనియర్ డైరెక్టర్ యశ్వీందర్ పాటియాల్ ప్రకారం, “మహిళలు ప్రతి పనిని అత్యంత ఖచ్చితత్వంతో చేస్తారు. వారి పని ఫస్ట్ క్లాస్ అని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. వారి వర్ణ భావం అద్భుతంగా ఉంటుంది, అందుకే మా పెయింట్ జాబ్ యూనిట్లలో ఎక్కువగా మహిళలు పనిచేయడాన్ని మీరు చూస్తున్నారు.'
ఇంకా చెప్పాలంటే ఈ ఎంజి యూనిట్‌లో, మొత్తం 3 వర్క్ షిఫ్టులలో వర్కర్స్ పని చేస్తారు. అయితే ప్రస్తుతం, ఈ బ్రాండ్ దీని అవసరాలను పరిగణనలోకి తీసుకుని, ఇక్కడ రెండు షిఫ్టులలో మాత్రమే యూనిట్ పని చేస్తోంది.
ఇక్కడే ఉత్పత్తి కానున్న ఐసీఈ మరియు ఇవి
ఈ ఎంజి ప్లాంట్‌లో, ఎంజి హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ అలాగే దాని మొదటి ఎలక్ట్రిక్ కారు ZS మరియు ఇటీవల విడుదల చేసిన కామెట్ ఇవిలను అదే లైనప్‌లో ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కంపెనీ ప్రత్యేక యూనిట్‌ను సిద్ధం చేయాల్సిన అవసరం లేదు.
ఎంజీ ప్రొడక్షన్ లైన్ లోనే కాకుండా లీడర్ షిప్ లో కూడా 24 శాతం మంది మహిళలకు వాటా ఉండటం గమనార్హం. యశ్వీందర్ ప్రకారం, కంపెనీలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి కారణం ఏంటి అంటే సేఫ్ & సెక్యూరిటీ సిస్టం అలాగే అందుబాటులో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం, దేశంలో ఎంజి ఐసీఈ మోడల్‌లలో హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు ఎంజి ఆస్టర్ లను విక్రయిస్తుంది. ఎలక్ట్రిక్ మోడళ్ల గురించి చెప్పాలంటే, దేశంలో ఈబ్రాండ్ ZS ఇవి, ఎంజి కామెట్‌లను విక్రయిస్తోంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్