- మెరుగైన ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ తో వచ్చిన కొత్త స్పెషల్ ఎడిషన్
- పరిమిత సంఖ్యలో లభ్యం
హోండా కార్ ఇండియా లిమిటెడ్ ఎలివేట్ మోడల్ లో కొత్తగా ఒక స్పెషన్ ఎడిషన్ ని రూ.12.86 లక్షల ఎక్స్-షోరూం(ఢిల్లీ) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అపెక్స్ ఎడిషన్ గా పిలువబడుతున్న కొత్త స్పెషల్ ఎడిషన్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా రెగ్యులర్ ఎస్‍యూవీతో పోలిస్తే మెరుగైన డిజైన్ మరియు ఫీచర్లతో వచ్చింది. అలాగే ధర విషయానికి వస్తే, స్టాండర్డ్ వేరియంట్ తో పోలిస్తే దీని ధర రూ.15 వేలు మాత్రమే ఎక్కువగా ఉంది.
హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ కారు ముందు మరియు లోయర్ గార్నిష్ తో సైడ్ కింద స్పాయిలర్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ని పొందింది. ఇంటీరియర్ పరంగా, కొత్త స్పెషల్ ఎడిషన్ కారు క్యాబిన్ డ్యూయల్-టోన్ ఐవరీ కలర్ ని మరియు లెదరెట్ డోర్ లైనింగ్స్ తో బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ని పొందింది. అలాగే స్పెషల్ ఎడిషన్లో హోండా కంపెనీ ఏడు కలర్లలో యాంబియంట్ లైటింగ్ ని కూడా అందించింది. అలాగే ఈ స్పెషల్ ఎడిషన్ కారుకు మరింత అందాన్ని చేకూర్చేలా హోండా కంపెనీ ఫెండర్లపై, టెయిల్ గేట్ పై, సీట్ కవర్లపై, మరియు కుషన్లపై “అపెక్స్ ఎడిషన్” బ్యాడ్జింగ్ ని అందించింది.
కార్‌మేకర్ ఎలివేట్ అపెక్స్ ఎడిషన్‌ను పరిమిత సంఖ్యలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఎలివేట్ కారులో ఇప్పటికే ఉన్న V మరియు VX వేరియంట్‌ల ఆధారంగా వచ్చింది. ఇంకా, కారును పర్సనలైజ్ చేసి మరింత అందంగా మలుచుకోవాలని భావిస్తున్న కస్టమర్లకు ఈ స్పెషల్ ఎడిషన్ కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
వేరియంట్ వారీగా ఎలివేట్ స్టాండర్డ్ వేరియంట్ మరియు హోండా ఎలివేట్ అపెక్స్ ఢిల్లీ ఎక్స్-షోరూం ధరలు ఈ విధంగా ఉన్నాయి:
హోండా ఎలివేట్ వేరియంట్లు | స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర (ఢిల్లీ) | అపెక్స్ ఎడిషన్ లిమిటెడ్ పీరియడ్ ధర (ఢిల్లీ) |
V ఎంటి | రూ.12,71,000 | రూ.12,86,000 |
V సివిటి | రూ.13,71,000 | రూ.13,86,000 |
VX ఎంటి | రూ.14,10,000 | రూ.14,25,000 |
VX సివిటి | రూ.15,10,000 | రూ.15,25,000 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్