- మొదటగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన సిటీ
- ఈ నెల నుంచి హోండా అన్ని కార్ల ధరల పెంపు
గత నెలలో, హోండా కార్స్ ఇండియా దాని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది, పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. తాజాగా మేము దాని రివైజ్డ్ ధరల గురించి మీకు తెలియజేశాము. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా హోండా కంపెనీ ఆయా వేరియంట్లలో చేసిన మార్పులను మరియు ధరల మార్పును పరిశీలిద్దాం. మీకు తెలుసో లేదో సిటీ హైబ్రిడ్‌ని సిటీ eHEV అని కూడా పిలుస్తారు.
గత నెల వరకు చూస్తే హోండా సిటీ హైబ్రిడ్ V మరియు ZX అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు బ్రాండ్ V వేరియంట్‌ను ఉత్పత్తి నుండి నిలిపివేసింది. దీంతో ఇప్పుడు ఈ రేంజ్ లో కేవలం ZX వేరియంట్ మాత్రమే మిగిలి ఉంది. దీనికి అదనంగా, హోండా ZX వేరియంట్ సాలిడ్ మరియు మెటాలిక్ కలర్ ధరలను వరుసగా రూ. 16,100 మరియు రూ. 88,100 పెంచింది.
ధరల మార్పుతో, హోండా సిటీ హైబ్రిడ్ కొత్త ధరను గమనిస్తే, రూ. 20.55 లక్షల నుండి రూ. 21.35 లక్షలకు పెరిగింది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). కస్టమర్లు దీనిని గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్ మరియు అబ్సిడియన్ బ్లూ పెర్ల్ వంటి ఆరు కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్