- 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా పొందిన రెండు కార్లు
- ధర పరంగా కొద్దిగా ప్రీమియంగా ఉన్న ఈ మోడల్స్
హోండా కార్ ఇండియా లిమిటెడ్దాని వివిధ మోడళ్ల లైనప్‌లో కొన్ని కొత్త మెరుగైన ఫీచర్లను జత చేసినట్లు ప్రకటించింది. ఇతర కార్ల కంపెనీలతో పోటీకి సరిపోయేలా ఈ కార్లు వివిధ వేరియంట్‌లలో కొన్ని అదనపు ఫీచర్లను కూడా పొందాయి. ఇక్కడ మనం కొత్త జత చేయబడిన ఫీచర్ల విషయాలను తెలుసుకుందాం.
కొత్త స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో హోండా ఎలివేట్
ఎలివేట్ SV, V మరియు VX వేరియంట్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు వానిటీ మిర్రర్‌లతో (డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్) సన్ వైజర్‌లతో పరిచయం చేయబడ్డాయి.ఇంతకు ముందు కేవలం టాప్-స్పెక్ మోడల్స్ లో మాత్రమే ఈ ఫీచర్లు ఉండేవి. ఇప్పుడు, అన్ని ఇతర వేరియంట్లు కూడా రియర్ సెంటర్లో 3-పాయింట్ సీట్‌బెల్ట్, హెడ్ రీస్ట్రెయింట్, మరియు రియర్ సీట్ బెల్ట్ రిమైండర్‌ను పొందాయి. ప్రస్తుతం, హోండా ఎలివేట్ కి పోటీగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఎంజిఆస్టర్ మరియు స్కోడా కుషాక్ వంటి మోడల్స్ లో ఆయా బ్రాండ్లు ఈ ఫీచర్లను అందిస్తున్నాయి.
ఇండియన్ కరెన్సీలో ధర (ఎక్స్-షోరూం ఢిల్లీ):
సేఫ్టీ ఫీచర్లతో ఎలివేట్ | SV | V | VX | ZX |
1.5లీటర్ ఐ-విటెక్ఎంటి | రూ.11,91,000 | రూ.12,71,000 | రూ.14,10,000 | రూ.15,41,000 |
1.5లీటర్ఐ-విటెక్సివిటి | _ | రూ.13,71,000 | రూ.15,10,000 | రూ.16,43,000 |
స్టాండర్డ్ గా కొత్త సేఫ్టీ ఫీచర్లతో హోండా సిటీ
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్హోండా సిటీ SV మరియు V వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తీసుకువచ్చింది. దీంతో, హోండాసిటీ మోడల్ లో ఉన్న అన్ని వేరియంట్లు ఇప్పుడు స్టాండర్డ్ గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందాయి. ఐసీఈసిటీ మరియు హైబ్రిడ్ మోడల్స్ కూడా స్టాండర్డ్ గా అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ ని కూడా పొందాయి. దీనికి పోటీగా ఉన్న స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ మోడల్స్ లో కూడా ఈ ఫీచర్లను స్టాండర్డ్ గా అందించబడ్డాయి. మారుతి సియాజ్ కారులో మాత్రమే ఇప్పటికే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.
ఇండియన్ కరెన్సీలో ధర (ఎక్స్-షోరూం ఢిల్లీ):
సేఫ్టీ ఫీచర్లతో సిటీ | SV | V | VX | ZX |
1.5లీటర్ ఐ-విటెక్ ఎంటి | రూ.12,08,100 | రూ.12,85,000 | రూ.13,92,000 | రూ.15,10,000 |
1.5లీటర్ ఐ-విటెక్ సివిటి | _ | రూ.14,10,000 | రూ.15,17,000 | రూ.16,35,000 |
e:HEV | _ | _ | _ | రూ.20,55,100 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్