- ఎలివేట్ కు భారీగా పెరుగుతున్న డిమాండ్
- 3,683 యూనిట్లుగా నమోదైన ఎగుమతులు
హోండా కార్స్ ఇండియా అక్టోబరు-2023కి సంబంధించి నెలవారీ సేల్స్ రిపోర్టును ప్రకటించింది. ఈ కార్ మేకర్ డొమెస్టిక్ రిటైల్ మరియు ఎగుమతులతో కలిపి మొత్తంగా 13,083 యూనిట్లను విక్రయించింది. హోండా ఎలివేట్ ఎస్‍యూవీ లాంచ్ అవడంతో ఈ జపనీస్ ఆటోమేకర్ సేల్స్ ఒక్కసారిగా భారీ ఎత్తున ఊపందుకున్నాయి.
ఈ బ్రాండ్ డొమెస్టిక్ మార్కెట్లో అక్టోబరు-2023లో 9,400 యూనిట్ సేల్స్ రిజిస్టర్ చేసింది. ఇంకా చెప్పాలంటే, అదే నెలలో 3,683 యూనిట్లను ఎగుమతి కూడా చేసింది. అక్టోబరు-2022తో పోలిస్తే ఈ సారి 1,678 యూనిట్లు ఎక్కువగా విక్రయించి 55 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
నెలవారీ విక్రయాల పెర్ఫార్మెన్స్ గురించి హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ డైరెక్టర్ యుయిచి మురాటా మాట్లాడుతూ “మా కస్టమర్ల నుండి పండుగ సీజన్ కారణంగా కొత్త మోడల్ హోండా ఎలివేట్‌కు అద్భుతమైన స్పందన మరియు భారీగా డిమాండ్ కూడా ఉంది. ఎలివేట్ కి సంబంధించి భారీ డిమాండ్‌కు తగ్గట్టుగానే మేము చాలా యాక్టివ్ గా పని చేస్తున్నాము. దీంతో పాటుగా హోండా సిటీ మరియు అమేజ్ మోడల్స్ కూడా వాటి పెర్ఫార్మెన్స్ ను చాలా బాగా కొనసాగిస్తున్నాయి. ధన్‌తేరాస్ మరియు దీపావళి పండుగలు మున్ముందు ఉన్నందున మా డీలర్ షిప్స్ ద్వారా కస్టమర్లకు కార్ల డెలివరీని సులభతరం చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్