- మొత్తం ఎనిమిది మోడళ్లలో వివిధ టైంలైన్లలో ఎదురైన సమస్య
- నవంబర్ 5వ తేదీన ఫ్యూయల్ పంపులో సమస్యకు పరిష్కారం
హోండా కార్స్ ఇండియా (HCIL) ఇంతకు ముందు ప్రకటించిన రీకాల్ క్యాంపెయిన్ ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రీకాల్ క్యాంపెయిన్ అంతా వివిధ మోడళ్లకు సంబంధించి మొత్తం 90 వేలకు పైగా కార్లకు వర్తిస్తుంది, రీకాల్ కి కారణం ఏంటి అంటే, ఫ్యూయల్ పంప్‌కు సంబంధించినదిగా తెలుస్తుంది.
సమస్య ఎక్కడ ఉంది అంటే, ఫ్యూయల్ పంపులలో ఈ సమస్య ఎదురైనట్లు హోండా కంపెనీ పేర్కొంది. ఈ సమస్య ద్వారా కాలక్రమేణా, కారు ఇంజిన్ ఆగిపోతుంది లేదా స్టార్ట్ అవ్వడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. హోండా ప్రకారం, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్ గతంలో విడిభాగంగా మార్చబడిన పాత మోడళ్ల వివిధ యూనిట్లకు కూడా వర్తిస్తుంది.
2024 నవంబర్ 5వ తేదీ నుండి ఇండియా అంతటా దశలవారీగా పేర్కొన్న భాగాన్ని ఆయా కార్లలో భర్తీ చేసే కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడుతుందని, అందుకోసం యజమానులను వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నామని హోండా కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, జూన్ 2017 మరియు అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధికారిక డీలర్‌షిప్‌ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్‌లు కూడా తమ వెహికిల్ ని అధికారిక సర్వీస్ సెంటర్‌లో చెక్ చేసుకోవాలని కస్టమర్లను హోండా కంపెనీ అభ్యర్థించింది.
రీకాల్‌లో భాగంగా సమస్యకు గురైన మోడల్స్ లో అమేజ్, బ్రియో, BR-V, WR-V, సిటీ మరియు జాజ్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఎందుకంటే, ఈ మోడల్స్ 2017 ఆగస్టు 8వ తేదీ నుంచి 2018 జూన్ 30 మధ్య తయారు చేయబడ్డాయి. స్పేర్ పార్ట్స్ రీప్లేస్‌మెంట్ విభాగం కింద, పైన పేర్కొన్న అన్ని కార్లతో పాటుగా అలాగే అకార్డ్ మరియు సివిక్ కార్లకు కూడా వర్తిస్తుంది. చివరగా పేర్కొన్నవి 2,204 యూనిట్లు ఉండగా, మిగిలిన మొత్తం 90,468 యూనిట్లు రీకాల్ చేయబడ్డాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్