- రూ. 7.93 లక్షలతో ప్రారంభమైన ధరలు
- అందుబాటులో ఉన్న 2 వేరియంట్స్
హోండా కార్స్ ఇండియా కొత్త సేఫ్టీ ఫీచర్స్ జతచేయడమే కాకుండా తన అన్ని మోడల్ రేంజ్ లో ఫీచర్ లిస్ట్ ను అప్‌డేట్ చేసింది. అలాగే, ఈ కార్‌మేకర్ఎంట్రీ-లెవల్ సెడాన్, అమేజ్ వేరియంట్ లిస్ట్ లో మార్పులు చేసింది. దీనితో, ఈ మోడల్ ఇప్పుడు రెండు వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది, అవి S మరియు VX, దీనిని రూ. 7.93 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
హోండా అమేజ్ గతంలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో E, S, VX మరియు VX ఎలైట్ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉండేది. అలాగే, ఇంకా చెప్పాలంటే, ఆటోమేకర్ కారులో కూర్చునే ఐదుగురికి సీట్ బెల్ట్ రిమైండర్ ఫీచర్ ని స్టాండర్డ్ గా జోడించింది.
మెకానికల్‍గా, హోండా అమేజ్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ తో 89bhp మరియు 110Nm మాక్సిము టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అమేజ్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
వేరియంట్ వారీగా హోండా అమేజ్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | S | VX |
1.2 పెట్రోల్ మాన్యువల్ | రూ. 7,92,800 | రూ. 9,04,000 |
1.2 పెట్రోల్ సివిటి | రూ. 8,82,600 | రూ. 9,86,000 |
అనువాదించిన వారు: రాజపుష్ప