- 20 డిసెంబర్ 2023 నుంచి ప్రారంభంకానున్న బుకింగ్స్
- 2024 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం
దేశం అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని కియా 14 డిసెంబర్ 2023న ఆవిష్కరించింది. ఈ అప్ డేటెడ్ కాంపాక్ట్ ఎస్‍యూవీ రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ తో మరిన్ని ఫీచర్స్ మరియు అప్ డేటెడ్ టెక్ ఫీచర్స్ తో పొందింది. సోనెట్ లాంచ్ టైంలైన్ గురించి ఈ ఆటోమేకర్ ఎలాంటి సమాచారాన్ని అందించకపోయినా, 2024 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ త్వరలోనే అనగా 20 డిసెంబర్ 2023 నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ ఆర్టికల్ లో మేము మీ అవసరానికి అనుగుణంగా ఈ ఎస్‍యూవీ డెలివరీ ఎంత త్వరగా లభిస్తుందో మీకు తెలియజేయబోతున్నాము. అచ్చం సెల్టోస్ లాగే, సోనెట్ ని కొనుగోలు చేసే వారికి కూడా కె-కోడ్ బెనిఫిట్స్ లభించనున్నాయి.
ఈ స్కీం ద్వారా, కస్టమర్లు కొత్త సోనెట్ కోసం పెద్దగా కష్టపడే అవసరం ఉండదు. పెద్దగా క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా త్వరగా డెలివరీని పొందవచ్చు. దీని కోసం మొత్తంగా మీరు చేయాల్సిందల్లా ఇంతకు ముందు కియా కారును కొనుగోలు చేసిన కస్టమర్స్ ని కలవాలి. అలాగే, మై కియా(Mykia) యాప్ ద్వారా కె-కోడ్ ని 20 డిసెంబర్ 2023లోపు జనరేట్ చేయాల్సి ఉంటుంది. కె-కోడ్ ని ఉపయోగించి, యూజర్ కొత్త సోనెట్ ని అధికారిక వెబ్ సైట్ ద్వారా డిసెంబర్ 20వ తేదీ అర్ధరాత్రి నుంచి బుక్ చేసుకోవచ్చు.
ఎవరైతే కస్టమర్స్ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని కొనాలని భావిస్తున్నారో వారు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ని HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే 7 వేరియంట్స్ లో పొందవచ్చు. ఇక కలర్స్ విషయానికి వస్తే, సోనెట్ ఫేస్‌లిఫ్ట్ పీటర్ ఆలివ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్,ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, క్లియర్ వైట్, అరోరా బ్లాక్ పెర్ల్‌తో గ్లేసియర్ వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్‌తో గ్లేసియర్ వైట్ పెర్ల్ మరియు ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ పెయింట్ వంటి 11 కలర్స్ లో అందుబాటులోకి వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్