సాధారణంగా మీరు ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్తూ ఉంటారు, అలా ట్రిప్ కు వెళ్ళినపుడు అక్కడ షాపింగ్ చేయడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. అలాంటి సమయంలో మీ కార్లలో తక్కువ బూట్‌స్పేస్ కారణంగా మరింత ఎక్కువగా షాపింగ్ చేయలేకపోవచ్చు. దీనికి అనుగుణంగా మీకు కార్లలో 400 లీటర్ల కంటే ఎక్కువగా బూట్‌స్పేస్ ని అందించే టాప్ -5 ఎస్‍యువిలను మీ ముందుకు తీసుకువచ్చాం. కేవలం బూట్‌స్పేస్ మాత్రమే కాకుండా ఆ కార్ల ప్రారంభం ధర, వాటిలో అందించబడిన ముఖ్యమైన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
ముందుగా, సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ గురించి చెప్పాలంటే, ఇది యూ, ప్లస్ మరియు మ్యాక్స్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీనిని రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ 511 లీటర్ల బూట్‌స్పేస్ ని కలిగి ఉండగా, ఇందులో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంది.
డిజైన్ పరంగా, ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ నుండి వచ్చిన C3 ఎయిర్‌క్రాస్ ఎస్‍యువిలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రౌండెడ్ ఫాగ్ లైట్స్, వైడ్ ఎయిర్ డ్యామ్, కాంట్రాస్ట్-కలర్ స్కిడ్ ప్లేట్స్, బ్లాక్-అవుట్ బి-పిల్లర్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ఎస్‍యువి 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో జతచేయబడి ఉంది. ఈ మోటార్ 109bhp మరియు 190Nm టార్క్ పవర్ అవుట్‌పుట్ ని ఉత్పత్తి చేస్తూ మరియు 18.5కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఎంజి హెక్టర్
ఈ ఎస్‌యువి 587 లీటర్ల బూట్‌స్పేస్ తో అందుబాటులో ఉండగా,ఎంజి హెక్టర్‌ను స్టైల్, షైన్, స్మార్ట్, స్మార్ట్ EX, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో మరియు సావీ ప్రో వంటి వేరియంట్స్ లో పొందవచ్చు. ఇది రూ. 13.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే,ఇది ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (పేడిస్ట్రియన్), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బెండ్ క్రూయిజ్ అసిస్టెన్స్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ వంటి ఫీచర్లతో లెవెల్ ఏడీఏఎస్(ఎడాస్)సూట్‌ను పొందింది. ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ అసిస్టెన్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, సేఫ్ డిస్టెన్స్ వార్నింగ్ మరియు ట్రాఫిక్ జామ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కూడా పొందింది.
ఎంజి హెక్టర్‌హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, టాటా హారియర్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ వంటి కార్లకు పోటీగా ఉంది.
హోండా ఎలివేట్
ఎలివేట్ 458 లీటర్ల బూట్‌స్పేస్ ను కలిగి ఉండగా, దీనిని ధర రూ.11.79లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు. బయటివైపు, ఎలివేట్ ఎస్‌యువి స్టైలింగ్‌తో , పొడవైన మరియు వెడల్పైన బోనెట్‌ను కలిగి ఉంది. దాని హెడ్‌ల్యాంప్ క్లస్టర్, పెద్ద స్క్వేర్ గ్రిల్ మరియు నిటారుగా ఉండి డిఆర్ఎల్ఎస్ ద్వారా ఫ్రంట్ ఫాసియా హైలైట్ చేయబడింది. మరోవైపు, ఎస్‌యువి 17-ఇంచ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను పొందింది.
ఎలివేట్ లో 1.5-లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాక్సిమమ్ 119bhp మరియు 145Nm మాక్సిమమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు సివిటి యూనిట్ ఉన్నాయి. అలాగే, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఎంజి ఆస్టర్ మరియు టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌లకు హోండా ఎలివేట్ పోటీగా నిలుస్తుంది.
టాటా హారియర్
టాటా హారియర్ 445 లీటర్ల బూట్‌స్పేస్ తో అందుబాటులో ఉండగా, ఇది రూ. 14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభ ధరతో ఉంది. హారియర్ ఫేస్‌లిఫ్ట్ ను స్మార్ట్(O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ +, అడ్వెంచర్ + డార్క్, అడ్వెంచర్+ ఎ, ఫియర్ లెస్, ఫియర్ లెస్డార్క్, ఫియర్ లెస్+, మరియు ఫియర్ లెస్+ డార్క్ అనే 10 వేరియంట్స్ లో పొందవచ్చు.
సేఫ్టీ పరంగా, హారియర్ 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, బ్రేక్ అసిస్టెన్స్ ,ఈఎస్‍పి, హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్‌లతో కూడిన ఏబీఎస్‍లను అందిస్తుంది. ఈ వెహికిల్ ఏడీఏఎస్(ఎడాస్) సూట్ ను కూడా పొందింది. అలాగే, లేటెస్టుగా టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ కి గ్లోబల్ ఎన్ క్యాప్ ద్వారా 5-స్టార్ రేటింగ్ లభించింది.
టాటా హారియర్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ 2.0-లీటర్, 4-సిలిండర్ క్రియోటెక్ ఇంజిన్ తో జతచేయబడి రాగా, ఈ మోటార్ 168bhp మరియు 350Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తూ ఇంతకు ముందున్న వెర్షన్స్ తో పోలిస్తే మరింత ఎక్కువగా మైలేజ్ ని అందిస్తుంది.
కియా సెల్టోస్
కియా సెల్టోస్ ఎస్‌యువి 433 లీటర్ల బూట్‌స్పేస్ కలిగి ఉంది. దీనిని రూ. 10.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. సెల్టోస్ HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే 7 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ముందు భాగంలో, అప్‌డేటెడ్ సెల్టోస్ కొత్త గ్రిల్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కలిగి ఉన్న కొత్తగా రూపొందించిన బంపర్ మరియు లోయర్ గ్రిల్‌తో కొత్త స్కిడ్ ప్లేట్‌ను పొందుతుంది. అంతే కాకుండా, ఇది కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్స్, బానెట్‌పై రన్నింగ్ లైట్ బార్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ఏడీఏఎస్(ఎడాస్)సూట్ ను కలిగి ఉంది.
2024 కియా సెల్టోస్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 112bhp మరియు 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి మరియు సివిటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 136bhp మరియు 242Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 6-స్పీడ్ క్లచ్‌లెస్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి ఆప్షన్ తో జత చేయబడింది.