- గ్రాండ్ విటారాలో అందుబాటులో ఉన్న స్ట్రాంగ్ మరియు మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయినస్
- 6 వేరియంట్స్ మరియు 10 కలర్స్ లో కస్టమర్లు ఎంచుకునే అవకాశం
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఇటీవలే దేశం మార్కెట్లో ఒక సంవత్సరం అమ్మకాలు పూర్తి చేసుకుంది. కార్‌వాలే తో సంభాషణలో బాగంగా, కార్‌మేకర్ దాని మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెలబ్రేషన్ మైలురాయిలోని కీలక వివరాలను వెల్లడించారు.
మారుతి ప్రకారం, గ్రాండ్ విటారా మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్‌లు అమ్మకాలు అధికంగా పెరిగి , 62 శాతం చేరుకున్నాయి. తర్వాత స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్స్ 23 శాతం స్థాయి కలిగి ఉండగా, సిఎన్ జి మరియు ఆల్‌గ్రిప్ వేరియంట్స్ వరుసగా 13 శాతం మరియు 2 శాతం కలిగి ఉన్నాయి.
ఏడబ్ల్యూడి ఫార్మాట్ మరియు ఏటిలో గ్రాండ్ విటారాకు పోటీగా ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ కు తక్కువ కస్టమర్ డిమాండ్ ఉన్నప్పటికీ, వీటిని లైనప్ నుండి తొలగించే విషయంలో కంపెనీకి ఎటువంటి ప్రణాళిక లేదని మారుతి పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో, మారుతి సుజుకి భారతదేశంలో గ్రాండ్ విటారాను 1.2 లక్షల యూనిట్లకు పైగా విక్రయించినట్లు వెల్లడించింది. అదే సమయంలో, భారతదేశం అంతటా దీనిపై వెయిటింగ్ పీరియడ్ ఎనిమిది వారాలకు తగ్గిందని తెలిపారు.
అనువాదించిన వారు: రాజపుష్ప