- అందుబాటులో ఉన్న 2 వేరియంట్స్
- 2023మోడల్ స్టాక్ పై లభిస్తున్న మాక్సిమం డిస్కౌంట్స్
మారుతి సుజుకి జిమ్నీ స్టాక్ ఇండియాలో భారీ డిస్కౌంట్స్ తో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం, మార్చి 2024లో లైఫ్‌స్టైల్ ఎస్‌యువిపై రూ.1.50లక్షలు వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిని జీటా మరియు ఆల్ఫా అనే రెండు వేరియంట్స్ లో రూ. 12.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
2023 మోడల్ ను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు, 2023 మోడల్ స్టాక్‌పై బుక్ చేసుకున్న తర్వాత మాక్సిమం రూ. 1.50 లక్షలు వరకు క్యాష్ డిస్కౌంట్లను పొందవచ్చు. మరోవైపు, 2024 మోడల్ స్టాక్ పై రూ.50,000 క్యాష్ ఆఫర్లు లభిస్తుండగా ,అర్హతను బట్టి రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ని పొందవచ్చు. ఈ ఆఫర్లు తాత్కాలికం కాగా, వేరియంట్, ప్రాంతం, స్టాక్ లభ్యత మరియు ఇతర అంశాలపై ఆధారపడి మారవచ్చు.
మారుతి ఫైవ్-డోర్ జిమ్నీని 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటారును 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడి పొందవచ్చు. ఈ మోటారు 103bhp మరియు 134Nm మాక్సిమం టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, అలాగే బ్రాండ్ యొక్క ఆల్ గ్రిప్ ప్రో సిస్టమ్ ద్వారా కారు యొక్క 4 వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప