- నాలుగు వేరియంట్లలో లభ్యం
- ఇండియాలో రూ.6.66 లక్షలతో ధరలు ప్రారంభం
మారుతి సుజుకి దాని మోస్ట్ పాపులర్ ప్రీమియం హ్యచ్ బ్యాక్ అయిన బాలెనోపై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఇది సిగ్మా, డెల్టా, జీటా, మరియు ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో రూ.6.66 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
మార్చి నెలలో కస్టమర్స్ ఎవరైతే ఈ హ్యచ్ బ్యాక్ ని బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారో వారికి రూ.57,000 వరకు బెనిఫిట్స్ లభించనున్నాయి. ఇందులో రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్, మరియు రూ.7,000 కార్పోరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే, వేరియంట్, డీలర్షిప్, ప్రాంతం మరియు ఇతర అంశాలను బట్టి ఇవి మారే అవకాశం ఉంది. ఈ ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకుసమీపంలో ఉన్న మారుతి సుజుకి-అధికారిక నెక్సాడీలర్షిప్ను సంప్రదించగలరు.
బాలెనో కారును 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ ని కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్జి కిట్ ఆప్షన్ తో జతచేయబడి పొందవచ్చు. ఈ మోటార్ స్టాండర్డ్ వెర్షన్లో 88bhp మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, సిఎన్జి మోడ్ లో 76bhp మరియు 98.5Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్ల పరంగా చూస్తే, ఈ హ్యచ్ బ్యాక్ 50-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్ ని పొందింది. ఇంకో విషయం ఏంటి అంటే, సిఎన్జి వేరియంట్లు కేవలం మాన్యువల్ గేర్ బాక్సుతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్