- థార్ RWD పోటీ పడనున్న గూర్ఖా RWD
- 3-డోర్ వెర్షన్ లో అందించబడే అవకాశం
మహీంద్రా థార్ RWD వెర్షన్ కి పోటీగా ఫోర్స్ మోటార్స్ దానికి ధీటుగా గూర్ఖాలో RWD వెర్షన్ ని తీసుకువస్తుంది. ఇండియన్ ఆటోమేకర్ గూర్ఖా RWD వెర్షన్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా, మరికొన్ని నెలలలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతానికి, ఫోర్స్ గూర్ఖా AWD డ్రివెట్రిన్ స్టాండర్డ్ గా 3-డోర్ వెర్షన్ మరియు 5-డోర్ వెర్షన్లలో అందించబడింది. ఈ కాన్ఫిగరేషన్లో, గూర్ఖా డైరెక్టుగా మహీంద్రా థార్ 3-డోర్ వెర్షన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. ఈ 3-డోర్ వెర్షన్ థార్ RWD పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో రూ. 11.35 లక్షల అతి తక్కువ ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
డిజైన్ పరంగా, గూర్ఖా RWD వెర్షన్ 3-డోర్ బాడీ స్టైల్ ఏమాత్రం తీసిపోదు. ప్రస్తుతం, ఫోర్స్ గూర్ఖా 3-డోర్ వెర్షన్ ధర రూ. 16.75 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, 5-డోర్ వెర్షన్ ధర రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంది. గూర్ఖా RWD వేరియంట్ ధర రూ. 14 లక్షల నుంచి రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూం) మధ్య ఉండవచ్చని మేము భావిస్తున్నాం. మహీంద్రా థార్ పై సుదీర్ఘమైన లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఉండగా, ఒకవేళ ఫోర్స్ దీనిని త్వరగా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తే మాత్రం RWD మహీంద్రా థార్ సేల్స్ తగ్గి, గూర్ఖా RWD వెర్షన్ సేల్స్ పెరుగుతాయి.
మేము తాజాగా లాంచ్ చేయబడిన 5-డోర్ గూర్ఖాను డ్రైవ్ చేసాము మరియు మా మొదటి డ్రైవ్ వీడియో మా యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్