- 2024 చివరలో 5-డోర్ థార్ లాంచ్ అయ్యే అవకాశం
- పెద్ద ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సన్ రూఫ్ మరియు మరిన్నింటిని పొందనున్న మోడల్
గత కొన్ని సంవత్సరాల నుంచి మహీంద్రా & మహీంద్రా థార్ ఆఫ్-రోడర్ యొక్క 5-డోర్ వెర్షన్ ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఇలా టెస్టింగ్ చేస్తూ ఈ ఎస్‍యూవీ ఇండియన్ రోడ్లపై పలుమార్లు కనిపించింది. అయితే, తాజాగా ఇది 3-డోర్ లేదా థార్ ప్రస్తుత వెర్షన్ తో పాటుగా పార్కింగ్ చేసి ఉండగా కనిపించింది.
బయటి వైపు చూస్తే, విశాలమైన లెంగ్త్ తో పాటుగా 5-డోర్ థార్ పెద్ద 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, డీఆర్ఎల్స్ తో కూడిన సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ ని పొందనుంది. ఇంకా చెప్పాలంటే, రాబోయే థార్ లో సింగిల్-పేన్ సన్ రూఫ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను పొందనుంది. తాజా వెర్షన్లో ఈ రెండూ మిస్ అయ్యాయి.
ఇంటీరియర్స్ పరంగా, 5-డోర్ థార్ కొత్త అప్హోల్స్టరీతో అప్‍డేటెడ్ క్యాబిన్ మరియు బ్రౌన్ ఇంటీరియర్ థీమ్ ని పొందనుంది. ఇంకా చెప్పాలంటే, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, రియర్ ఏసీ వెంట్స్, రెండవ వరుసలో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్, మరియు డ్యూయల్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్స్ వంటి వాటిని పొందనుంది.
హుడ్ కింద, 5-డోర్ థార్ ఇంతకు ముందున్న 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ కూడా ప్రస్తుత వెర్షన్స్ లాగానే ఉండే అవకాశం ఉంది. ఇది లాంచ్ అయ్యాక, ఈ సెగ్మెంట్లో సేల్స్ పరంగా కొత్త మారుతి సుజుకి జిమ్నీ మరియు రాబోయే 5-డోర్ ఫోర్స్ గూర్ఖా తో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్